Share News

ప్రతీ ధాన్యపు గింజను కొనుగోలు చేస్తాం

ABN , Publish Date - Nov 13 , 2025 | 11:15 PM

రైతులు పండిం చిన ప్రతీ ధాన్యం గింజను ప్రభు త్వమే కొనుగోలు చేస్తుందని కల్వ కుర్తి ఎమ్మెల్యే కశిరెడ్డి నారాయణ రెడ్డి తెలిపారు.

ప్రతీ ధాన్యపు గింజను కొనుగోలు చేస్తాం
జీడిపల్లిలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభిస్తున్న కల్వకుర్తి ఎమ్మెల్యే కశిరెడ్డి నారాయణరెడ్డి

- కల్వకుర్తి ఎమ్మెల్యే కశిరెడ్డి నారాయణరెడ్డి

కల్వకుర్తి, నవంబరు 13 (ఆంధ్రజ్యోతి) : రైతులు పండిం చిన ప్రతీ ధాన్యం గింజను ప్రభు త్వమే కొనుగోలు చేస్తుందని కల్వ కుర్తి ఎమ్మెల్యే కశిరెడ్డి నారాయణ రెడ్డి తెలిపారు. రైతులు దళారు లను ఆశ్రయించకుండా ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రా ల్లోనే విక్రయించి మద్దతు ధర పొందాలని ఎమ్మెల్యే కోరారు. గురువారం కల్వకుర్తి మండలం జీడిపల్లి గ్రామంలో వరి కొనుగోలు కేంద్రాన్ని ఎమ్మెల్యే ప్రారంభించారు. రాష్ట్రంలో రైతుల సంక్షేమం, అభివృద్ధి కోసం ప్రభుత్వం అహర్నిశలు పని చేస్తుందని ఎమ్మె ల్యే తెలిపారు. కార్యక్రమంలో మాజీ జడ్పీ వైస్‌ చైర్మన్‌ ఠాకూర్‌ బాలాజీసింగ్‌, మార్కెట్‌ కమిటీ చైర్‌పర్సన్‌ వావిలాల ఉమామనీశా, సంజీవ్‌కు మార్‌యాదవ్‌, కల్వకుర్తి మాజీ సర్పంచ్‌ బృంగి ఆనంద్‌కుమార్‌, మాజీ జడ్పీటీసీ ఎన్‌.అశోక్‌రెడ్డి, మార్కెట్‌ కమిటీ డైరెక్టర్‌ పసుల రమాకాంత్‌ రెడ్డి, సభ్యులు, అధికారులు పాల్గొన్నారు.

గెలుపోటములను సమానంగా స్వీకరించాలి

క్రీడాకారులు గెలుపోటములను సమానంగా స్వీకరించి క్రీడాస్ఫూర్తిని ప్రదర్శించాలని కల్వ కుర్తి ఎమ్మెల్యే కశిరెడ్డి నారాయణరెడ్డి కోరారు. క ల్వకుర్తి పట్టణంలోని బీఎస్‌ఎన్‌ఎల్‌ మైదానంలో కొనసాగుతున్న క్రికెట్‌ టోర్నమెంట్‌ను గురువా రం ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ క్రీడల అభివృద్ధికి ప్రభు త్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటుందని తెలిపా రు. కల్వకుర్తి స్టేడియంలో మౌలిక వసతుల క ల్పనకు కావాల్సిన నిధులు మంజూరు చేయిం చడం జరుగుతుందని ఎమ్మెల్యే పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జడ్పీ మాజీ వైస్‌ చైర్మన్‌ ఠాకూర్‌ బాలాజీసింగ్‌, కల్వకుర్తి మాజీ సర్పంచ్‌ బృంగి ఆనంద్‌కుమార్‌, ఎస్సీ, ఎస్టీ మానిటరింగ్‌ కమిటీ సభ్యులు జిల్లెల రాములు, మార్కెట్‌ కమిటీ చైర్‌పర్సన్‌ ఉమామనీలా సంజీవ్‌కుమా ర్‌యాదవ్‌, సీఐ బి.నాగార్జున, వెల్దండ మాజీ సర్పంచ్‌ ఎన్నం భూపతిరెడ్డి, మార్కెట్‌ కమిటీ డైరెక్టర్లు పసుల రమాకాంత్‌రెడ్డి, కొండల్‌, కాంగ్రెస్‌ నాయకులు దున్న భాస్కర్‌, పలువురు నాయకులు తదితరులుపాల్గొన్నారు.

Updated Date - Nov 13 , 2025 | 11:15 PM