Share News

శాలిగౌరారం ప్రాజెక్టును నల్లగొండ జిల్లా పరిధిలోకి తెస్తాం

ABN , Publish Date - Apr 29 , 2025 | 12:24 AM

సూర్యాపేట జిల్లా నీటి పారుదల శాఖ పరిధిలో ఉన్న శాలిగౌరారం ప్రాజెక్టును నల్లగొండ జిల్లా నీటి పారుదల శాఖలోకి తెచ్చేందుకు కృషి చేస్తామని భువనగిరి ఎంపీ చామల కిరణ్‌కుమార్‌రెడ్డి తెలిపారు.

శాలిగౌరారం ప్రాజెక్టును నల్లగొండ జిల్లా పరిధిలోకి తెస్తాం
పలివాడ గ్రామ సమీపంలోని శాలిగౌరారం ప్రాజెక్టును పరిశీలిస్తున్న ఎంపీ కిరణ్‌కుమార్‌రెడ్డి, ఎమ్మెల్యేలు వీరేశం, సామేలు

ఎంపీ చామల కిరణ్‌కుమార్‌రెడ్డి

శాలిగౌరారం, రామన్నపేట, ఏప్రిల్‌ 28(ఆంధ్రజ్యో తి): సూర్యాపేట జిల్లా నీటి పారుదల శాఖ పరిధిలో ఉన్న శాలిగౌరారం ప్రాజెక్టును నల్లగొండ జిల్లా నీటి పారుదల శాఖలోకి తెచ్చేందుకు కృషి చేస్తామని భువనగిరి ఎంపీ చామల కిరణ్‌కుమార్‌రెడ్డి తెలిపారు. ప్రా జెక్టుకు అనుసంధానంగా నిర్మించిన ఫీడర్‌ ఛానల్‌ను రామన్నపేట మండలం మూసీ నది సమీపంలోని పల్లివాడ హెడ్‌ వర్క్స్‌ను, సూరారం, తుర్కపల్లి గ్రామ సమీపంలోని హెడ్‌వర్క్స్‌ షట్టర్లను, శాలిగౌరారం ప్రా జెక్టును ఎమ్మెల్యేలు వేముల వీరేశం, మందుల సామే ల్‌లతో కలిసి సోమవారం పరిశీలించారు. మూసీనది నుంచి వరద నీరు ఉధృతంగా వస్తున్నా ఫీడర్‌ ఛానల్‌ ద్వారా ప్రాజెక్టులోకి ఎందుకు సక్రమంగా వెళ్లడం లే దని అధికారులను ప్రశ్నించారు. షట్టర్లు, కాల్వ అధ్వానంగా ఉన్నా ఎందుకు పట్టించుకోవడం లేదని అధికారులను నిలదీశారు. శాలిగౌరారం ఫీడర్‌ ఛానల్‌ పరిధిలో ఉన్న హెడ్‌ వర్క్స్‌ షటర్లకు, రామాంజపురం వద్ద బ్రిడ్జి నిర్మాణానికి, ప్రాజెక్టు కట్ట అభివృద్ధికి నాలుగేళ్ల క్రితం మిషన్‌కాకతీయ కింద రూ.5.10కోట్లు మంజూరయ్యాయని, అందులో కేవలం రూ.2.10కోట్ల పనులు జరిగాయని, మిగిలిన రూ.3కోట్ల పనులను 15 రోజు ల్లోపు కాంట్రాక్టర్‌తో పూర్తి చేయించాలని ఆదేశించారు. ప్రాజెక్టు అభివృద్ధి, పెండింగ్‌లో ఉన్న బిల్లు కోసం సీఎం రేవంత్‌రెడ్డితో మాట్లాడుతానన్నారు. కార్యక్రమం లో ఐబీ ఈఈ జెల్లా సత్యనారాయణ, డీఈ సత్యనారాయణ, కాంగ్రెస్‌ నాయకుడు నూక కిరణ్‌కుమార్‌ యాదవ్‌, మార్కెట్‌ చైర్మన్‌ పాదూరి శంకర్‌రెడ్డి, వైస్‌ చైర్మన్‌ నరిగే నర్సింహ, కందాల సమరంరెడ్డి, అన్నెబోయిన సుధాకర్‌, గూని వెంకటయ్య, సింగల్‌ విండో వైస్‌ ఛైర్మెన్‌ చామల మహేందర్‌రెడ్డి, వేముల గోపినాథ్‌, చామల వెంకటరంగారెడ్డి, చాడ రమేష్‌ చం దర్‌రెడ్డి, వాసుదేవరెడ్డి, జయపాల్‌రెడ్డి పాల్గొన్నారు

.

Updated Date - Apr 29 , 2025 | 12:24 AM