పోలింగ్‌కేంద్రం మార్చకపోతే ఎన్నికలు బహిష్కరిస్తాం
ABN , Publish Date - Sep 30 , 2025 | 11:11 PM
గ్రామంలో ఉన్న పోలింగ్ కేంద్రాన్ని మార్చకపోతే రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలను బహిష్కరి స్తామని సిర్సా గ్రామస్థులు హెచ్చరించారు. మంగళవారం సిర్సా గ్రామా నికి వెళ్లిన తహసీల్దార్ రాఘవేందర్‌రావుకు గ్రామస్థులు మూకుమ్మడిగా ఫిర్యాదు చేశారు.
కోటపల్లి, సెప్టెంబరు 30 (ఆంధ్రజ్యోతి) : గ్రామంలో ఉన్న పోలింగ్ కేంద్రాన్ని మార్చకపోతే రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలను బహిష్కరి స్తామని సిర్సా గ్రామస్థులు హెచ్చరించారు. మంగళవారం సిర్సా గ్రామా నికి వెళ్లిన తహసీల్దార్ రాఘవేందర్‌రావుకు గ్రామస్థులు మూకుమ్మడిగా ఫిర్యాదు చేశారు. పోలింగ్‌కేంద్రం ఉన్న పాఠశాల భవనం గ్రామం చివర న ఉండడంతో ఎన్నికల రోజు ప్రలోభాల వాతావరణం ఏర్పడుతుందని గత ఎన్నికల్లో దాడులు జరిగాయని, పోలీసు కేసులు నమోదైన సంఘట నలున్నాయని తెలిపారు. దీంతో మహిళలు, వృద్ధులు, దివ్యాంగులు పో లింగ్ కేంద్రానికి రాలేక భయంతో వెనుదిరుగుతున్నారని పేర్కొన్నారు. ప్ర త్యామ్నాయంగా పంచాయతీ కార్యాలయం, మహిళ భవన్, రైతు వేదిక లో పోలింగ్ కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని కోరారు. ప్రస్తుత పోలింగ్ కేంద్రం కొనసాగితే ఒక వర్గానికే లాభం జరుగుతుందని, ప్రజాస్వామ్యా నికి నష్టం వాటిల్లుతుందని, దీనికై పోరాడుతామని, ప్రలోభాలకు లొంగ కుండా ఓటు వేసే వాతావరణం కల్పించాలని గ్రామస్థులు కోరారు.