kumaram bheem asifabad- అర్హులకు ఇందిరమ్మ ఇళ్లు కేటాయిస్తాం
ABN , Publish Date - Dec 27 , 2025 | 10:08 PM
అర్హులైన వారందరికీ ఇందిరమ్మ ఇళ్లు కేటాయిస్తామని ఎమ్మెల్యే పాల్వాయి హరీష్‌బాబు అన్నారు. మండల కేంద్రంలోని రైతు వేదికలో 26 మంది లబ్ధిదారులకు శనివారం ఇళ్ల మంజూరు పత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ లబ్ధిదారులు వెంటనే ఇళ్ల పనులను ప్రారంభించాలని సూచించారు.
పెంచికలపేట, డిసెంబరు 27 (ఆంధ్రజ్యోతి): అర్హులైన వారందరికీ ఇందిరమ్మ ఇళ్లు కేటాయిస్తామని ఎమ్మెల్యే పాల్వాయి హరీష్‌బాబు అన్నారు. మండల కేంద్రంలోని రైతు వేదికలో 26 మంది లబ్ధిదారులకు శనివారం ఇళ్ల మంజూరు పత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ లబ్ధిదారులు వెంటనే ఇళ్ల పనులను ప్రారంభించాలని సూచించారు. పేదల సొంత ఇంటి కల సాకారం చేయడమే లక్ష్యమన్నారు. అర్హులైన వారందరికి దశల వారీగా అదేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. నూతనంగా ఎన్నికైన సర్పంచ్‌లు రాజకీయాలను పక్కన పెట్టి లబ్ధిదారులను ఎంపిక చేయాలని సూచించారు. ఇళ్ల కేటాయింపుల్లో అక్రమాలకు పాల్పడితే చర్యలు తప్పవని హెచ్చరించారు. నియోజక వర్గంలోని ప్రతి గ్రామ పంచాయతీకి 20 నూతన ఇళ్ల మంజూరు చేస్తామని తెలిపారు. కార్యక్రమంలో సర్పంచ్‌లు రాంచందర్, రవి, రుకుంబాయి, ఉమాదేవి, రాజేశ్వరి, వెంకటేష్ పాల్గొన్నారు.
దహెగాం, (ఆంధ్రజ్యోతి): మండల కేంద్రంలోని 29 మంది ఇందిరమ్మ లబ్ధిదారు లకు శనివారం ఎమ్మెల్యే పాల్వాయి హరీష్‌బాబు మంజూరు పత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కొత్తగా గెలిచిన సర్పంచ్‌లు రాజకీయాలకు అతీతంగా గ్రామాలను అభివృద్ధి చేయాలని చెప్పారు. తారతమ్య భేదాలు మరిచి పోవాలని హితవులు పలికారు. ఆతీయ ఉపాధి హామీ పథకం కింద గ్రామాల్లో సీసీ రోడ్లు, డ్రైన్లు నిర్మించుకునేందుకు ప్రతిపాదనలు పంపించాలన్నారు. కార్యక్రమంలో ఎంపీడీవో నస్రుల్లా, ఎంపీవో శ్రీనివాస్, ఏఈ సందీప్, కార్యదర్శులు, సర్పంచలు జయలక్ష్మి, శంకర్, మల్లీశ్వరి, మలక్క, గోపాల్, సత్యనారాయణ, భారతి, సతీష్, మహేష్, పరమేష్, అంకులు, దామోదర్ తదితరులు పాల్గొన్నారు.