కమిటీల ఏర్పాటుకు ఐక్యతతో కృషి చేయాలి
ABN , Publish Date - Dec 18 , 2025 | 12:23 AM
పద్మశాలి నూతన కమిటీల ఏర్పాటుకు ఐక్యతతో కృషి చేయాలని పద్మశాలి సంఘం మండల అధ్యక్షుడు చిలగాని బొండయ్య, దేవాలయ కమిటీ అధ్యక్షుడు సిరిపురం రామన్నలు తెలి పారు. నస్పూర్ పద్మశాలి సంక్షేమ సంఘం, శ్రీ లక్ష్మి గణపతి శివ మార్కం డేయ దేవాలయం నూతన కమిటీలను జనవరి 4న ఏర్పాటు చేయనున్నట్లు ఈ సందర్భంగా వారు తెలిపారు.
పద్మశాలి సంఘం నాయకులు
నస్పూర్, డిసెంబరు 17 (ఆంధ్రజ్యోతి) : పద్మశాలి నూతన కమిటీల ఏర్పాటుకు ఐక్యతతో కృషి చేయాలని పద్మశాలి సంఘం మండల అధ్యక్షుడు చిలగాని బొండయ్య, దేవాలయ కమిటీ అధ్యక్షుడు సిరిపురం రామన్నలు తెలి పారు. నస్పూర్ పద్మశాలి సంక్షేమ సంఘం, శ్రీ లక్ష్మి గణపతి శివ మార్కం డేయ దేవాలయం నూతన కమిటీలను జనవరి 4న ఏర్పాటు చేయనున్నట్లు ఈ సందర్భంగా వారు తెలిపారు. నస్పూర్ ప్రెస్ క్లబ్‌లో బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. సంఘం, ఆలయం కమిటీ కాల పరిమితి ముగిసినందున రద్దు చేసి వచ్చే నెల 4న ఆలయ అవరణలో సమా వేశమై నూతన కమిటీలను ఏర్పాటు చేస్తామన్నారు. పద్మశాలి కులస్తులు సకాలంలో హాజరై నూతన కమిటీల ఏర్పాటుకు ఐక్యతతో కృషి చేయాలన్నారు. ఈ సమావేశంలో సంఘం నాయకులు వేముల సురేష్, చిప్ప రాజబాబు, కొండ శ్రీనివాస్, కుందారపు రమేష్, శర్వానంద్, నాగరాజు, రవీందర్, రామన్న, సర్వేశం, శంకర్, రాములు, తదితరులు పాల్గొన్నారు.