kumaram bheem asifabad- సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకోవాలి
ABN , Publish Date - Nov 21 , 2025 | 10:12 PM
ప్రభుత్వ సంక్షేమ పథకాలను సద్వినియో గం చేసుకోవాలని రాష్ట్ర మహిళా కమిషన్ సభ్యురాలు కుమ్ర ఈశ్వరిబాయి అన్నారు. మండలంలోని ఎనోలిగూడ గ్రామాన్ని శుక్రవారం ఆమె సందర్శించారు. ఈ సందర్భంగా గ్రామస్తులతో సమావేశమై లబ్ధిదారులకు అందుతున్న ప్రభుత్వ సంక్షేమ పథకాలపై అడిగి తెలుసుకున్నారు
వాంకిడి, నవంబరు 21 (ఆంధ్రజ్యోతి): ప్రభుత్వ సంక్షేమ పథకాలను సద్వినియో గం చేసుకోవాలని రాష్ట్ర మహిళా కమిషన్ సభ్యురాలు కుమ్ర ఈశ్వరిబాయి అన్నారు. మండలంలోని ఎనోలిగూడ గ్రామాన్ని శుక్రవారం ఆమె సందర్శించారు. ఈ సందర్భంగా గ్రామస్తులతో సమావేశమై లబ్ధిదారులకు అందుతున్న ప్రభుత్వ సంక్షేమ పథకాలపై అడిగి తెలుసుకున్నారు. ఇటీవల పీఎం జన్‌మన్ ద్వారా గ్రామానికి 19 ఇళ్లు మంజూరు అయినప్పటికీ అటవీ అధికారులు అనుమతి ఇవ్వడం లేదని తమ సమస్య పరిష్కరించాలని ఈశ్వరిబాయికి గ్రామస్థులు విన్నవించుకున్నారు. ఉన్నతాధికారులతో మాట్లాడి సమస్య పరిష్కరించేలా కృషి చేస్తానని హామీ ఇచ్చారు. గ్రామంలో నెలకొన్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అటవీ ప్రాంతంలో రోజు రోజుకు చలి తీవ్రత పెరుగుతున్న నేపథ్యంలో కుమరం ఈశ్వరిబాయి రాజు ఫౌండేషన్ ఆధ్వర్యంలో గ్రామంలో 20 కొలం గిరిజన కుటుంబాలకు దుప్పట్లు పంపిణీ చేశారు. కార్యక్రమంలో కొలాం సంఘం నాయకులు జలపతి, అన్నిగా, అన్నపూర్ణ, పగ్గు, లింగు, తుకారాం, లేతు తదితరులు పాల్గొన్నారు.
ఆసిఫాబాద్ రూరల్, నవంబరు 21 (ఆంధ్రజ్యోతి) ఆసిఫాబాద్ మండలం కోలాం సాలెగూడ గ్రామాన్ని రాష్ట్ర మహిళా కమిషన్ సభ్యురాలు కుమ్ర ఈశ్వరిబాయి శుక్రవారం సందర్శించి దుప్పట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా గ్రామస్థులతో సమావేశమై లబ్ధిదారులకు అందుతున్న ప్రభుత్వ సంక్షేమ పథకాల గురించి తెలుసుకున్నారు. పీఎంజన్ మన్ ద్వారా నూతనంగా మంజూరైనా ఇళ్లకు భూమి పూజ చేశారు. అనంతరం కుమ్ర ఈశ్వరిబాయి రాజు ఫౌండేషన్ ద్వారా గ్రామంలోని 20 కుటుంబాలకు స్వచ్ఛందంగా దుప్పట్లు పంపిణీ చేశారు. కార్యక్రమంలో నాయకులు జలపతి, కార్యదర్శి పద్మ తదితరులు పాల్గొన్నారు.