kumaram bheem asifabad- వన్యప్రాణుల సంరక్షణకు పాటుపడాలి
ABN , Publish Date - Sep 18 , 2025 | 11:13 PM
వన్యప్రాణుల సంరక్షణ కోసం టాస్క్‌ఫోర్స్ పాటుపడాలని జిల్లా అటవీ శాఖాధికారి నీరజ్‌కుమార్ అన్నారు. డీపీవో కార్యాలయంలో గురువారం టాస్క్‌ఫోర్స్ సిబ్బంది గదిని ప్రారంభిచారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ కాంతిలాల్ పాటిల్‌తో కలిసి వన్యప్రాణులకు సంబంధించిన కేసులలో శిక్షలకు సంబంధించి టాస్క్‌ఫోర్స్ సిబ్బందితో సమావేశం నిర్వహించారు.
ఆసిఫాబాద్‌రూరల్, సెప్టెంబరు 18 (ఆంధ్రజ్యోతి): వన్యప్రాణుల సంరక్షణ కోసం టాస్క్‌ఫోర్స్ పాటుపడాలని జిల్లా అటవీ శాఖాధికారి నీరజ్‌కుమార్ అన్నారు. డీపీవో కార్యాలయంలో గురువారం టాస్క్‌ఫోర్స్ సిబ్బంది గదిని ప్రారంభిచారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ కాంతిలాల్ పాటిల్‌తో కలిసి వన్యప్రాణులకు సంబంధించిన కేసులలో శిక్షలకు సంబంధించి టాస్క్‌ఫోర్స్ సిబ్బందితో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో వన్యప్రాణులను వేటాడే కేసులో నిందితులకు త్వరగా శిక్షపడేలా చూడాలన్నారు. వన్యప్రాణుల సంరక్షణ కోసం టాస్క్‌ఫోర్స్ పని చేయాల్సి ఉంటుందన్నారు. ఎప్పటికప్పుడు పోటీసులు, అటవీ శాఖ సిబ్బంది సమన్వయంతో పని చేస్తూ వన్యప్రాణుల సంరక్షణ కోసం కృషి చేయాలన్నారు. టాస్క్‌ఫోర్స్ సమావేశాలు నిర్వహిస్తూ సమస్య పరిష్కారం కోసం ప్రయత్నం చేయాలని సూచించారు. కార్యక్రమంలో ఏఎస్పీ చిత్తరంజన్, ఎఫ్‌డీఓ సుశాంత్‌సుఖదేవ్, సిబ్బంది ముసవీర్, ఝాన్సీరాణి, సద్దాం పాల్గొన్నారు.