Share News

క్రీడల్లో రాణించి దేశానికి పేరు తేవాలి

ABN , Publish Date - Jul 30 , 2025 | 11:23 PM

క్రీడల్లో రాణించి దేశానికి పేరు తే వాలని నల్లగొండ పట్టణ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు గుమ్ముల మోహన్‌రెడ్డి కోరా రు.

క్రీడల్లో రాణించి దేశానికి పేరు తేవాలి
క్రీడాకారులను సన్మానిస్తున్న కాంగ్రెస్‌ పట్టణ అధ్యక్షుడు గుమ్ముల మోహన్‌రెడ్డి

నల్లగొండ స్పోర్ట్స్‌, జూలై 30(ఆంధ్రజ్యోతి): క్రీడల్లో రాణించి దేశానికి పేరు తే వాలని నల్లగొండ పట్టణ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు గుమ్ముల మోహన్‌రెడ్డి కోరా రు. అంతర్జాతీయ క్రీడల్లో భాగంగా నార్వేలో ఆగస్టు 20వ తేదీ నుంచి 30వ తేదీ వరకు జరిగే స్లంసాకర్‌(పుట్‌బాల్‌) హోంలేస్‌ ఇంటర్నేషనల్‌ వరల్డ్‌ కప్‌ పోటీలకు నల్లగొండకు చెందిన క్రీడాకారిణి మద్దినాల లావణ్య ఎంపికైంది. అదేవిధంగా క్రీడాకారిణి పవిత్ర హైదరాబాద్‌లోని గచ్చిబౌలి స్టేడియంలో ఫీఫా అకాడమికి ఎంపికైంది. వారిని బుధవారం నల్లగొండలోని క్యాంపు కార్యాలయం లో సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో పుట్‌బాల్‌ కోచ్‌ కె. దాసు, సునిత, రజిత, రఫీ, సిద్ధార్థ, సోనీ, సాగర్‌, కత్తుల కోటి పాల్గొన్నారు.

Updated Date - Jul 30 , 2025 | 11:23 PM