Share News

నాణ్యమైన చీరలు అందిస్తున్నాం

ABN , Publish Date - Nov 23 , 2025 | 11:58 PM

రాష్ట్రంలో కోటి మంది మహిళలకు ఇంది రమ్మ మహిళా శక్తి పథకం ద్వా రా చీరల పంపిణీ కార్యక్రమం కొనసాగుతోందని నాగర్‌కర్నూల్‌ ఎమ్మెల్యే కూచకుళ్ల రాజేశ్‌రెడ్డి అ న్నారు.

నాణ్యమైన చీరలు అందిస్తున్నాం
బిజినేపల్లిలో మహిళలకు చీరలు అందజేస్తున్న ఎమ్మెల్యే రాజేశ్‌రెడ్డి

- నాగర్‌కర్నూల్‌ ఎమ్మెల్యే కూచకుళ్ల రాజేశ్‌రెడ్డి

కందనూలు/ బిజినేపల్లి/ తి మ్మాజిపేట/ తాడూరు, నవంబ రు 23 (ఆంధ్రజ్యోతి) : రాష్ట్రంలో కోటి మంది మహిళలకు ఇంది రమ్మ మహిళా శక్తి పథకం ద్వా రా చీరల పంపిణీ కార్యక్రమం కొనసాగుతోందని నాగర్‌కర్నూల్‌ ఎమ్మెల్యే కూచకుళ్ల రాజేశ్‌రెడ్డి అ న్నారు. సిరిసిల్ల నేతన్నలతో నేయించిన అద్భు తమైన డిజన్లతో కూడిన నాణ్యమైన ఇందిరమ్మ చీరలను పంపిణీ చేస్తుందని అన్నారు. నాగర్‌క ర్నూల్‌ ఎంపీడీవో కార్యాలయ ఆవరణలో ఆది వారం ఆయన మహిళలకు చీరలను పంపిణీ చేశారు. గతంలో మాదిరిగా కాకుండా నాణ్య మైన చీరలు పంపిణీ చేస్తున్నట్లు ఎమ్మెల్యే తెలి పారు. ఈ కార్యక్రమంలో పలువురు ప్రజాప్రతి నిధులు, కాంగ్రెస్‌ నాయకులు, కార్యకర్తలు తది తరులు పాల్గొన్నారు. బిజినేపల్లి ఎంపీడీవో కా ర్యాలయ అవరణలో, తిమ్మాజిపేటలోని రైతు వేదికలో, తాడూరులో మహిళా సంఘాల స భ్యులకు చీరలను ఎమ్మెల్యే రాజేశ్‌రెడ్డి చీరలను పంపిణీ చేశారు. గ్రామీణ ప్రాంతాల్లో ప్రతీ మ హిళకు డిసెంబరు 9 వరకు చీరలను అందజే స్తామని ఎమ్మెల్యే అన్నారు. బిజినేపల్లిలో ఆర్డీవో సురేష్‌ కుమార్‌, ఎంపీడీవో కతలప్ప, మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ రమణారావు, కాంగ్రెస్‌ మండల అధ్యక్షుడు మిద్దె రాములు, మార్కెట్‌ డైరెక్టర్‌ వాల్యానాయక్‌, మాజీ ఎంపీటీసీ సభ్యుడు ఆం జనేయులు, చంద్రగౌడ్‌, హరీశ్‌రెడ్డి, నరేందర్‌ గౌడ్‌, వంగ రామన్‌గౌడ్‌, బాలపీరు, తిమ్మాజి పేటలో డీఆర్‌డీవో చిన్న ఓబులేష్‌, రాష్ట్ర టెలి కాం శాఖ డైరెక్టర్‌ శ్రీనివాస్‌బహుదూర్‌, బ్లాక్‌ కాంగ్రెస్‌ అధ్యక్షుడు మల్లయ్యగౌడ్‌, మార్కెట్‌ క మిటీ డైరెక్టర్‌ మాధవులు, కాంగ్రెస్‌ పార్టీ మండ ల అధ్యక్షుడు వెంకట్రామిరెడ్డి, ఏపీఎం నిరంజ న్‌, సమాఖ్య అధ్యక్షురాలు అమృత పాల్గొన్నారు.

Updated Date - Nov 23 , 2025 | 11:58 PM