Share News

ప్రజా ఉద్యమాలకు సిద్ధం కావాలి

ABN , Publish Date - Sep 07 , 2025 | 11:32 PM

ప్రజా ఉద్యమాలకు సిద్దం కావాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు ఎం బాలనరసింహ పిలు పునిచ్చారు.

ప్రజా ఉద్యమాలకు సిద్ధం కావాలి
కామ్రేడ్‌ నారాయణరెడ్డి చిత్రపటానికి పూల మాలలు వేసి నివాళులర్పిస్తున్న సీపీఐ నాయకులు

- సీపీఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు ఎం.బాలనరసింహ

కందనూలు, సెప్టెంబరు 7 (ఆంధ్రజ్యోతి) : ప్రజా ఉద్యమాలకు సిద్దం కావాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు ఎం బాలనరసింహ పిలు పునిచ్చారు. నాగర్‌కర్నూల్‌ జిల్లా కేంద్రంలో ని లక్ష్మణాచారి భవన్‌లో సీపీఐ జిల్లా కార్యవర్గ స మావేశాలు ఇందిరమ్మ అధ్యక్షతన నిర్వహించా రు. ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చకపోతే ప్రజాపోరాటాలకు సిద్ధమవుతామని హెచ్చరించారు. కొల్లాపూర్‌ ని యోజకవర్గంలో ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల ఎం పికలో అవకతవకలు జరిగాయని ఆరోపించారు. వాటిని సరిచేయకపోతే మండల కేంద్రాల్లో ఆం దోళనలు చేపడుతామని హెచ్చరించారు. అనం తరం సీపీఐ జిల్లా కార్యదర్శి ఎస్‌ఎండీ ఫయాజ్‌ మాట్లాడుతూ రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో జిల్లా వ్యాప్తంగా పార్టీ బలం ఉన్న ప్రతీచోట పోటీ చేస్తా మని అన్నారు. అంతకుముం దు కామ్రేడ్‌ నారాయణరెడ్డి వర్ధంతిని పురస్కరించుకొని ఆయన చిత్రపటానికి పూల మాలలు వేసి నివాళులర్పిం చారు. ఈ కార్యక్రమంలో సీ పీఐ రాష్ట్ర సమితి సభ్యులు కేశ వులుగౌడ్‌, జిల్లా కార్యవర్గ స భ్యులు టి.నరసింహ, విజేయు డు, జిల్లా కౌన్సిల్‌ సభ్యులు కృష్ణాజీ, మర్యాద వెంకటయ్య, ఆర్‌.ఇంద్ర, బొల్లెద్దుల శ్రీనివాస్‌, కిరణ్‌, మల్లయ్య, గోపాల్‌ శంకర్‌గౌడ్‌, బిజ్జ శ్రీను, బండి లక్ష్మీపతి, శివశంకర్‌, రవీందర్‌, తుమ్మల శివుడు, మల్లేష్‌, పరశురాములు, గడ్డం శ్రీను, గోపాల్‌, మధుగౌడ్‌, నరేష్‌, మద్దిలేటి తదితరులు పాల్గొన్నారు.

రాజకీయ జోక్యం అరికట్టాలి

కొల్లాపూర్‌ : ఇందిరమ్మ ఇంటి నిర్మాణ పథ కంలో రాజకీయ జోక్యం అరికట్టాలని సీపీఐ జి ల్లా కార్యదర్శి ఎస్‌ఎండీ ఫయాజ్‌ కోరారు. అధి కారులే అర్హులను గుర్తించేలా ప్రభుత్వం చర్య లు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు. ఆదివా రం ఫయాజ్‌ తన నివాస గృహంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు.

Updated Date - Sep 07 , 2025 | 11:32 PM