జిల్లా సర్వతోముఖాభివృద్ధికి భాగస్వాములు కావాలి
ABN , Publish Date - Aug 15 , 2025 | 11:52 PM
జిల్లా స ర్వతోముఖాభివృద్ధికి ప్రతీ ఒక్కరూ భాగస్వాములు కావాలని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు హర్కర వేణుగోపాల్ రావు పేర్కొన్నారు. కలెక్టర్ కుమార్ దీపక్, బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం వినోద్, కనీస వేతనాల సంఘం చైర్మన్ బి. జనక్ ప్రసాద్, అదనపు కలెక్టర్ చంద్రయ్యలతో కలిసి శుక్రవారం 79వ స్వా తంత్య్ర వేడుకలకు ముఖ్య అతిథిగా పాల్గొని జాతీయ పతా కాన్ని ఆవిష్కరించారు.
స్వాతంత్య్ర పోరాట స్పూర్తిగానే ప్రభుత్వ ప్రజాస్వామ్య పాలన
రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు హార్కర వేణుగోపాల్‌రావు
కలెక్టరేట్ ఆవరణలో స్వాతంత్య్ర వేడుకలు
ఆకట్టుకున్న సంస్కృతిక నృత్యాలు, స్టాళ్లు
మంచిర్యాల కలెక్టరేట్, ఆగస్టు15 (ఆంధ్రజ్యోతి): జిల్లా స ర్వతోముఖాభివృద్ధికి ప్రతీ ఒక్కరూ భాగస్వాములు కావాలని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు హర్కర వేణుగోపాల్ రావు పేర్కొన్నారు. కలెక్టర్ కుమార్ దీపక్, బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం వినోద్, కనీస వేతనాల సంఘం చైర్మన్ బి. జనక్ ప్రసాద్, అదనపు కలెక్టర్ చంద్రయ్యలతో కలిసి శుక్రవారం 79వ స్వా తంత్య్ర వేడుకలకు ముఖ్య అతిథిగా పాల్గొని జాతీయ పతా కాన్ని ఆవిష్కరించారు. అంతకుముందు పోలీసుల నుంచి గౌ రవ వందనం స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మా ట్లాడుతూ70 ఏళ్లుగా ప్రజా పంపిణీ వ్యవస్థ పేద ప్రజల ఆ హార భద్రతకు భరోసా ఇస్తుందన్నారు. 13వేల కోట్ల రూపా యల వ్యయంతో 3కోట్ల10లక్షల మందికి సన్నబియ్యం అంది స్తున్నామన్నారు. జిల్లాలో 2,47,923 మంది కార్డుదారులకు స న్న బియ్యం పంపిణీ చేస్తున్నామన్నారు. రాష్ట్రంలోని 25లక్షల 35వేల మంది రైతులకు 20వేల 616 కోట్ల రూపాయల రు ణమాఫీ చేశామన్నారు. జిల్లాలో రైతు బీమా పథకం కింద 83వేల 114 మంది రైతులను చేరి ఇప్పటి వరకు 347 మంది రైతులకు రూ.5లక్షల చొప్పున 17కోట్ల 35లక్షల రూపాయలు చెల్లించామన్నారు. తొలి విడత ప్రతి నియోజకవర్గంలో 3వేల 500 ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేశామన్నారు. ఇందుకు గాను 22వేల 500 కోట్ల రూపాయలు వెచ్చిస్తున్నామన్నారు. రాజీవ్ ఆరోగ్య పరిధిని రూ.5లక్షల నుంచి 10లక్షలకు పెంచా మన్నారు. 27 ఎకరాల విస్తీర్ణంలో 2వేల700 కోట్ల రూపాయల వ్యయంతో నయా ఉస్మానియా ఆసుపత్రి భవన సముదాయా న్ని నిర్మిస్తున్నామన్నారు. ప్రభుత్వం బాధ్యతలు స్వీకరించిన 48 గంట ల్లోనే మహాలక్ష్మీ పథకం కింద ఆడ బిడ్డలకు ఆర్ టీసీలో ఉచిత రవాణ సౌకర్యాన్ని కల్పించామన్నారు.
గృహజ్యోతి....
గృహజ్యోతి పథకం ద్వారా 200 యూనిట్ల ఉచిత విద్యుత్ సరఫరా ద్వారా జిల్లాలో ప్రతి నెల సుమారుగా లక్ష నివా సా లకు ఉచిత విద్యుత్ అందిస్తూ లక్షా 25వేల 759 మంది విని యోదారులకు నెలకు 4కోట్ల 96లక్షల రూపాయలు ఖర్చు చే స్తూ ఇప్పటి వరకు 71కోట్ల 38లక్షల రూపాయల లబ్ది చేకూ ర్చిందన్నారు. ఇందిరా మహిళా శక్తి ద్వారా రాష్ట్రంలో కోటి మంది ఆడబిడ్డలను కోటీశ్వర్లును చేయాలన్న సంకల్పంతో జి ల్లాలో సౌర విద్యుత్ ప్లాంట్ల ఏర్పాటుకు దండేపల్లి మండ లంలో శంకుస్థాపన చేసి మరొక ప్లాంట్‌కు మందమర్రి మం డలాన్ని గుర్తించామన్నారు. మహిళలు పెట్రోల్‌బంక్‌ల నిర్వ హణ, మహిళాశక్తి క్యాంటీన్ల నిర్వహణ చేపట్టారన్నారు. రాష్ట్రంలో భూ సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం భూభారతి నూతన చట్టాన్ని ప్రవేశపెట్టి రైతులకు అనుకూలంగా అప్పీలు వ్యవస్థను పొందుపరిచి పైలెట్ ప్రాజెక్టు కింద భీమారం మండలాన్ని ఎంపిక చేసి ప్రత్యేక రెవెన్యూ సదస్సు నిర్వహిం చి భూ సంబంధిత దరఖాస్తులు స్వీకరించామన్నారు. జిల్లా అభివృద్దికి నిరంతరం పని చేస్తున్న జిల్లా ఇన్‌చార్జి మంత్రి జూపల్లి కృష్ణారావు, పార్లమెంట్ సభ్యులు గడ్డం వంశీక్రిష్ణ, శాసనమండలి సభ్యులు దండే విఠల్‌లకు, జిల్లా యంత్రానికి ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధికారులు దుర్గ ప్రసాద్, డీఆర్‌డీఏ కిషన్, డీపీవో వెంకటేశ్వర్‌రావు, ఏవో పిన్న రాజేశ్వర్, బెల్లంపల్లి సబ్‌కలెక్టర్ మనోజ్, డీసీపీ భాస్కర్, క్రిష్ణమూర్తి, డీటీవో సంతోస్ కుమార్, డీటిడీవో జనార్ధన్, రా మ్మోహన్‌రావు, పాల్గొన్నారు.
లక్షెట్టిపేట: పట్టణంలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ కార్యా లయాల్లో, అన్ని విధ్యాసంస్థల్లో అదే విధంగా వివిధ పార్టీల, సంఘాల ఆధ్వర్యంలో ఆదివారం స్వాతంత్ర వేడుకలను ఘ నంగా నిర్వహించారు. తహాసీల్దార్ దిలీప్‌కుమార్, సీఐ రమ ణమూర్తి, ఎస్‌ఆర్‌వో బాల్‌కిషన్, సూపరిండెంట్ ఆకుల శ్రీని వాస్, మున్సిపల్ మేనేజర్ కల్లెడ రాజశేఖర్, ఎంపీడీవో సరోజ, ఏవో శ్రీకాంత్, ఎంఈవో శైలజ, సీడీపీవో రేష్మా, డీఆర్‌వో సు నీత జాతీయ పథాకాన్ని ఎగురవేసారు. అదేవిధంగా బీఆర్‌ఎస్ పార్టీ ఆద్వర్యంలో మాజీ ఎమ్మెల్యే నడిపల్లి దివాక ర్‌రావు, కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు ఆరీఫ్, బీజేపీ ఆధ్వ ర్యంలో హరిగోపాల్‌రావు జాతీయ జెండాలను ఎగురవేశారు.
చెన్నూర్ : చెన్నూరు పట్టణం, మండలంలో శుక్రవారం 79వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలను ఘనంగా జరుపుకు న్నారు. పట్టణంలోని మున్సిఫ్ కోర్టు ఆవరణలో న్యాయమూర్తి పర్వతపు రవి, తహసీల్దార్ మల్లికార్జున్, మున్సిపల్ కమీషనర్ మురళీకృష్ణ, ఎంపీడీవో మోహన్, సీఐ దేవేందర్‌రావు, విద్యా ధికారి దత్తుకుమార్, చెన్నూరు ప్రెస్‌క్లబ్ అధ్యక్షుడు అట్టెం మధునయ్య జాతీయ పతాకాన్ని ఎగురవేశారు.
నస్పూర్ : నస్పూర్ పట్టణం పరిధిలో వాడవాడాల శుక్ర వారం మువ్వన్నెల జెండా రెపరెపలాడింది. ప్రభుత్వ కార్యాల యాలు, ప్రైవేట్, ప్రభుత్వ పాఠశాలల్లో, వివిధ కుల సంఘా లు, కూడళ్ళ వద్ద రాజకీయ పక్షాలకు చెందిన నేతలు త్రివర్ణ పతాకాలను ఆవిష్కరించారు. సీసీసీ కార్నర్ రాజీవ్ చౌరస్తా వద్ద జిల్లా కాంగ్రెస్ అధ్యక్షురాలు కొక్కిరాల సురేఖ ప్రేమ్ సా గర్ రావు జెండాను ఆవిష్కరించారు. నస్పూర్‌లోని బీఆర్‌ఎస్ జిల్లా పార్టీ కార్యాలయం వద్ద జిల్లా అఈ్యక్షుడు బాల్క సుమ న్, తెలంగాణ తల్లి చౌరస్తా వద్ద మాజీ ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్ రావు, బీఆర్‌ఎస్ పట్టణ పార్టీ కార్యాలయం వద్ద ప ట్టణ అద్యక్షుడు సుబ్బయ్య జెండాలను ఎగురవేసారు. గో దా వరి కాలనీ షిర్కే చౌరస్తాలో సీపీఐ రాష్ట్ర కార్యదర్శివర్గ స భ్యుడు కలవేన శంకర్, ఆయా కూడళ్ళ వద్ద జోగుల మల్ల య్య, రాజేశ్వర్ రావులు త్రీవర్ణ పతాకాలను ఎగుర వేశారు.
మంచిర్యాలక్రైం: స్వాతంత్య్ర సమరయోధుల ఆశయ సాధన కోసం ప్రతి ఒక్కరు కృషి చేయాలని రామగుండం పోలీసు కమిషనరేట్ అంబర్ కిషోర్‌ఝా అన్నారు. కమిషన రేట్ కార్యాలయంలో స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలను నిర్వ హించారు. మహానీయుల చిత్రపటాలకు పూల మాలలు వేసి నివాళులు ఆర్పించారు. సాయుధ పోలీసుల ఆధ్వర్యంలో ఏ ర్పాటు చేసినగౌరవ వందనాన్ని పతాకానికి అందిస్తూ జాతీ య పతాకాన్ని ఆవిష్కరించారు.