Share News

పార్టీ బలోపేతానికి కృషిచేయాలి

ABN , Publish Date - May 08 , 2025 | 11:54 PM

బూత్‌ స్థాయిలో పార్టీని బలోపేతం చేయాలని బీజేపీ రాష్ట్ర కార్యదర్శులు తూటపల్లి రవికుమార్‌, మూగ జయశ్రీ అన్నారు.

పార్టీ బలోపేతానికి కృషిచేయాలి
సమావేశంలో మాట్లాడుతున్న బీజేపీ రాష్ట్ర నాయకుడు రవికుమార్‌

భువనగిరి టౌన్‌, మే 8 (ఆంధ్రజ్యోతి: బూత్‌ స్థాయిలో పార్టీని బలోపేతం చేయాలని బీజేపీ రాష్ట్ర కార్యదర్శులు తూటపల్లి రవికుమార్‌, మూగ జయశ్రీ అన్నారు. భువనగిరిలో గురువారం జరిగిన సమావేశంలో మాట్లాడారు. మండల కమిటీలు ఏర్పాటు చేయాలన్నారు. కమిటీల్లో అన్ని వర్గాలకు చెందిన పని చేసే నాయకులకే అవకాశం కల్పించాలన్నారు. త్వరలో జరుగనున్న స్థానిక సంస్థల ఎన్నికలకు సమాయత్తం కావాలన్నారు. సమావేశంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు ఊట్కూరి అశోక్‌గౌడ్‌, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పాశం భాస్కర్‌, పడాల శ్రీనివాస్‌, పడమటి జగన్మోహన్‌రెడ్డి, రత్నపురం బలరాం, సీహెచ్‌ సురేష్‌రెడ్డి, చందా మహేందర్‌గుప్తా, పట్నం శ్రీని వాస్‌, అచ్చయ్య పాల్గొన్నారు.

Updated Date - May 08 , 2025 | 11:54 PM