Share News

kumaram bheem asifabad- శాంతిభద్రతల పరిరక్షణకు పాటుపడాలి

ABN , Publish Date - Dec 20 , 2025 | 10:10 PM

పోలీసు అధికారులు విధి నిర్వహణలో ఎల్లప్పుడు అప్రమత్తంగా ఉంటూ శాంతిభద్రతల పరిరక్షణకు పాటుపడాలని ఎస్పీ నితికా పంత్‌ అన్నారు. వాంకిడి పోలీసు స్టేషన్‌ను శనివారం తనిఖీ చేశారు. ఈ సందర్భంగా స్టేషన పరిసరాలు, నమోదు చేసిన రికార్డులు, పెండింగ్‌ కేసుల పురోగతి, స్టేషన్‌ హాజరు రిజిస్టర్‌, స్టేషన శుభ్రత తదితర విభాగాలను పరిశీలించారు

kumaram bheem asifabad- శాంతిభద్రతల పరిరక్షణకు పాటుపడాలి
మాట్లాడుతున్న ఎస్పీ నితికా పంత్‌

వాంకిడి, డిసెంబరు 20 (ఆంధ్రజ్యోతి): పోలీసు అధికారులు విధి నిర్వహణలో ఎల్లప్పుడు అప్రమత్తంగా ఉంటూ శాంతిభద్రతల పరిరక్షణకు పాటుపడాలని ఎస్పీ నితికా పంత్‌ అన్నారు. వాంకిడి పోలీసు స్టేషన్‌ను శనివారం తనిఖీ చేశారు. ఈ సందర్భంగా స్టేషన పరిసరాలు, నమోదు చేసిన రికార్డులు, పెండింగ్‌ కేసుల పురోగతి, స్టేషన్‌ హాజరు రిజిస్టర్‌, స్టేషన శుభ్రత తదితర విభాగాలను పరిశీలించారు. ఎస్‌హెచ్‌వో మహేందర్‌, స్టేషన్‌ సిబ్బందితో సమావేశమై పలు సూచనలు చేశారు. శాంతి భద్రతల పరిరక్షణలో ప్రతి పోలీసు సిబ్బంది ఎల్లప్పుడు అప్రమత్తంగా ఉండాలని గ్రామాల్లో చట్ట వ్యతిరేక చర్యలు, అసాంధిక కార్యకలాపాలు ఆశ్రమ రవాణా మాదకద్రవ్యాలపై దృష్టి సారించాలని ఆదేశించారు. స్టేషనకు వచ్చే ప్రతి ఫిర్యాదుదారుడితో ప్రజలతో మరాయదపూర్వకంగా వ్యవహరించాలని అన్నారు. మహిళలు, బాలికల భద్రతకు సంబంధించిన కేసుల్లో ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని, లాండ్‌ ఆర్డర్‌ విషయంలో రాత్రి పూట పర్యవేక్షణ, పికెటింగ్‌, పెట్రోలింగ్‌కు కచ్చితంగా కొనసా గించాలని సూచించారు. ప్రజాభద్రతకు విఘాతం కలిగించే వారిపై చట్ట పరమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఎస్పీ వెంట సీఐ సత్యనారాయణ ఉన్నారు.

మైనర్లకు వాహనాలు ఇవ్వొద్దు

ఆసిఫాబాద్‌, డిసెంబరు 20 (ఆంధ్రజ్యోతి): జిల్లా పోలీసు శాఖ త్రిబుల్‌ రైడింగ్‌, రాష్‌ డ్రైవింగ్‌, మైనర్‌లు డ్రైవింగ్‌పై ప్రత్యేక శ్రద్ధ వహిస్తుందని మైనర్‌లు వాహనం నడిపి పట్టుబడితే యజమానిపై కూడా కేసు నమోదు చేస్తామని ఎస్పీ నితికా పంత్‌ అన్నారు. శనివారం జిల్లా పోలీసు కార్యాలయంలో ఏరాపటు చేసిన సమావేశంలో మాట్లాడుతూ మైనర్‌లకు వాహనాలు ఇవ్వరాదని, మైనర్‌ వాహనం నడిపినప్పుడు ప్రమాదాలు జరిగే అవకాశాలు ఎక్కుగా ఉంటాయని తెలిపారు. ఈ ప్రమాదాలు వాహన యజమానితో పాటు ఇతర వ్యక్తులకు కూడా నష్టం కలిగించే అవకాశ ముందని అన్నారు. మైనర్లకు వాహనాలు ఇవ్వకూడదన్నారు. అలాగే లైసెన్సులు లేకుండా డ్రైవింగ్‌ చేయకూడదని చెప్పారు. నంబర్‌ ప్లేట్‌ లేకుండా వాహనాలు నడపడం, నంబర్‌ ప్లేట్లు దాచడం, తప్పుడు నంబర్లు ఏర్పాటు చేయడం ప్రజలకు ఇబ్బంది కలిగించే విధంగా శబ్ద కాలుష్యాన్ని సృష్టించే విధంగా ద్విచక్ర వాహనాల సైలెన్సర్లను కలిగి ఉన్న వాహనదారులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. నంబర్లు గుర్తించలేని ఫ్యాన్సీ డిజైన్‌ లేదా తప్పుడు నంబర్లు ఏర్పాటు చేస్తున్నారని అన్నారు. వీలైనంత త్వరగా అన్ని వాహనాల నంబర్‌ ప్లేట్లను నిబంధనలకు అనుగుణంగా సరిగా ఏర్పాటు చేయాలని చెప్పారు. లేని పక్షంలో వాహనదారులపై ఛీటింగ్‌ కేసు నమోదు చేస్తామని తెలిపారు.

Updated Date - Dec 20 , 2025 | 10:10 PM