హమాలీల హక్కుల సాధన కోసం ఐక్య పోరాటాలు చేయాలి
ABN , Publish Date - Sep 07 , 2025 | 11:03 PM
బేవరేజెస్ హమాలీ కార్మికులు హక్కుల సాధన కోసం ఐక్య పోరాటాలు చేయాలని సీఐటీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాలడుగు భాస్కర్ అన్నారు. ఆదివారం జిల్లా కేంద్రంలోని బైపాస్‌రోడ్డులోని ఫంక్షన్‌హాలులో నిర్వహిం చిన హమాలీ కార్మికుల నాలుగో రాష్ట్ర మహాసభలకు ఆ యన హాజరై మాట్లాడారు.
సీఐటీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాలడుగు భాస్కర్
మంచిర్యాల కలెక్టరేట్, సెప్టెంబరు 7 (ఆంధ్రజ్యోతి) : బేవరేజెస్ హమాలీ కార్మికులు హక్కుల సాధన కోసం ఐక్య పోరాటాలు చేయాలని సీఐటీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాలడుగు భాస్కర్ అన్నారు. ఆదివారం జిల్లా కేంద్రంలోని బైపాస్‌రోడ్డులోని ఫంక్షన్‌హాలులో నిర్వహిం చిన హమాలీ కార్మికుల నాలుగో రాష్ట్ర మహాసభలకు ఆ యన హాజరై మాట్లాడారు. రాష్ట్ర వ్యాప్తంగా బేవేరెజెస్ గోదాముల్లో 2 వేల మందికి పైగా కార్మికులు పనిచే స్తు న్నారని , ప్రభుత్వానికి వారి ద్వారా కోట్ల రూపాయల ఆ దాయం సమకూరుతుందని అయినా వారిని శ్రమదో పిడికి గురి చేస్తుందన్నారు. ప్రైవేటు వ్యక్తులకు చెల్లిస్తు న్న డబ్బులతో సొంత గోదాములు నిర్వహించుకునే వీ లున్నప్పటికీ ప్రభుత్వం ఆ పనిచేయకపోవడం వి డ్డూ రంగా ఉందన్నారు. ఫలితంగా గోదాములు స్ధానికత పేరుతో బయట వ్యక్తులకు పోటీ పెరిగి హమాలీల పనులకు భద్రత కరువైందన్నారు. కంపెనీల నుంచి వచ్చిన వాహనాల్లో మద్యాన్ని బయట వ్యక్తులు దొంగత నాలు చేస్తున్నారని, అయినప్పటికీ ప్రభుత్వం చర్యలు చేపట్టకపోవడం సరైంది కాదన్నారు. హమాలీలకు మౌ లిక సదుపాయలు కల్పించడంలో ప్రభుత్వం విఫల మైం దన్నారు. లక్షల రూపాయలు ప్రైవేటు వ్యక్తుల గోదా ములు లీజుకు తీసుకుని ప్రభుత్వం నిధులను దుర్విని యోగం చేస్తుందన్నారు. అనంతరం గౌరవధ్యక్షుడు రా ములు మాట్లాడుతూ ఐకమత్యంతో హక్కులను సాధిం చుకోవాలని పిలుపునిచ్చారు. సంక్షేమ పథకాలకు కార్మి కులకు వర్తింపజేయాలని డిమాండ్ చేశారు. అంతకు ముందు ఐబీ చౌరస్తాలోని అంబేద్కర్ విగ్రహానికి పూల మాలలు వేసి నివాళులర్పించారు. ర్యాలీగా ఫంక్షన్‌హా లుకు చేరుకుని జెండా ఎగురవేశారు. ఈ కార్యక్రమం లో జిల్లా కార్యదర్శి రంజిత్‌కుమార్, గోమాస పకాష్, దా సరి రాజేశ్వరి, దేవదాస్ పాల్గొన్నారు.