Share News

kumaram bheem asifabad- స్థానిక ఎన్నికల్లో సత్తా చాటాలి

ABN , Publish Date - Jul 31 , 2025 | 10:49 PM

కాంగ్రెస్‌ పార్టీని క్షేత్ర స్థాయిలో బలోపేతం చేసేందుకు కార్యకర్తలు కృషి చేయాలని, రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో అన్ని స్థానాలు గెలిచి కాంగ్రెస్‌ జెండాను ఎగుర వేయాలని ఏఐసీసీ కార్యదర్శి సుభాష్‌ అన్నారు. జిల్లా కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో గురువారం ఎమ్మెల్సీ దండె విఠల్‌తో కలిసి ఏర్పాటు చేసిన రాజీవ్‌గాంధీ పంచాయతీరాజ్‌ సంఘటన్‌ కార్యక్రమంలో మాట్లాడారు

kumaram bheem asifabad- స్థానిక ఎన్నికల్లో సత్తా చాటాలి
మాట్లాడుతున్న ఏఐసీసీ కార్యదర్శి సుభాష్‌

ఆసిఫాబాద్‌ రూరల్‌, జూలై 31 (ఆంధ్రజ్యోతి): కాంగ్రెస్‌ పార్టీని క్షేత్ర స్థాయిలో బలోపేతం చేసేందుకు కార్యకర్తలు కృషి చేయాలని, రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో అన్ని స్థానాలు గెలిచి కాంగ్రెస్‌ జెండాను ఎగుర వేయాలని ఏఐసీసీ కార్యదర్శి సుభాష్‌ అన్నారు. జిల్లా కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో గురువారం ఎమ్మెల్సీ దండె విఠల్‌తో కలిసి ఏర్పాటు చేసిన రాజీవ్‌గాంధీ పంచాయతీరాజ్‌ సంఘటన్‌ కార్యక్రమంలో మాట్లాడారు కాంగ్రెస్‌ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించారు. పార్టీ కోసం పని చేసే వారికి తగిన గుర్తింపు లభిస్తుందన్నారు. వార్డు, గ్రామ స్థాయిలో బలోపేతంగా ఉంటేనే పార్టీ బలోపేతం అవుందని చెప్పారు. ఆ దిశగా కార్యకర్తలు చర్యలు తీసుకోవాలని సూచించారు. సంక్షేమ పథకాలను ప్రజలకు వివరిస్తూ పార్టీని బలోపేతం చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో డీసీసీ అధ్యక్షుడు విశ్వప్రసాద్‌రావు, మాజీ ఎమ్మెల్యే ఆత్రం సక్కు, నాయకులు గణపతి, బాలేష్‌, రామయ్య, ప్రకాష్‌రావు, రమేష్‌, చరణ్‌, వసంత్‌రావు, మహేష్‌గౌడ్‌, మునీర్‌ అహ్మద్‌, గోపాల్‌నాయక్‌, శివ, కార్తీక్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Jul 31 , 2025 | 10:49 PM