స్థానిక సంస్థల ఎన్నికల్లో సత్తా చాటాలి
ABN , Publish Date - Jun 25 , 2025 | 11:49 PM
స్తానిక ఎన్నికల్లో సత్తా చాటాలని యువజన కాంగ్రెస్ రాష్ట్ర ఇన్‌చార్జి ఖలీద్ జావేద్, రాష్ట్ర అధ్యక్షుడు జక్కిడి శివచరణ్‌రెడ్డి అన్నారు.
భువనగిరి టౌన్, జూన్ 25(ఆంధ్రజ్యోతి): స్తానిక ఎన్నికల్లో సత్తా చాటాలని యువజన కాంగ్రెస్ రాష్ట్ర ఇన్‌చార్జి ఖలీద్ జావేద్, రాష్ట్ర అధ్యక్షుడు జక్కిడి శివచరణ్‌రెడ్డి అన్నారు. యాదాద్రిభువనగిరి జిల్లాకేంద్రంలో బుధ వారం జరిగిన సమావేశంలో మాట్లాడారు. రాష్ట్రంలో పార్టీని అధికారంలోకి తెచ్చిన యువజన కాంగ్రెస్ కార్యకర్తలు స్థానిక సంస్థల ఎన్నికల్లో మరో మారు సత్తా చాటాలన్నారు. పార్టీ కోసం కష్టపడే కార్యకర్తలను ప్రభుత్వం, పార్టీ అధిష్టానం గుర్తిస్తుందన్నారు. ఉద్యోగ ఖాళీల భర్తీ, రాజీవ్ యువ వికాసం తదితర పథకాలతో రాష్ట్ర ప్రభుత్వం యువతకు అండగా ఉంటుంద న్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రజావ్యతిరేక విధానాలు, ఉద్యోగాలు, ఉపాధి కల్పనలో యువతను మోసగిస్తోందన్నారు. సమావేశంలో డీసీసీ అధ్యక్షుడు అడెం సంజీవరెడ్డి, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ ఎండీ. అవేజ్‌చిస్తి, జిల్లా యువజన కాంగ్రెస్ ఇన్‌చార్జి దుబ్బాక చంద్రిక తదితరులు పాల్గొన్నారు.