Share News

స్థానిక ఎన్నికల్లో సత్తాచాటాలి

ABN , Publish Date - Jun 28 , 2025 | 11:19 PM

రాష్ట్ర ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకుకెళ్లి త్వర లో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రె స్‌ పార్టీ సత్తా చాటాలని ఎమ్మెల్యే డాక్టర్‌ చిక్కు డు వంశీకృష్ణ పిలుపునిచ్చారు.

స్థానిక ఎన్నికల్లో సత్తాచాటాలి
సమావేశంలో మాట్లాడుతున్న అచ్చంపేట ఎమ్మెల్యే డాక్టర్‌ వంశీకృష్ణ

- ముఖ్య కార్యకర్తల సమావేశంలో పాల్గొన్న ఎమ్మెల్యే వంశీకృష్ణ

అమ్రాబాద్‌, జూన్‌ 28 (ఆంధ్రజ్యోతి) : రాష్ట్ర ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకుకెళ్లి త్వర లో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రె స్‌ పార్టీ సత్తా చాటాలని ఎమ్మెల్యే డాక్టర్‌ చిక్కు డు వంశీకృష్ణ పిలుపునిచ్చారు. మండల కేం ద్రంలోని ఎంకే గార్డెన్‌ ఫంక్షన్‌ హాల్‌లో నిర్వహిం చిన మండల కాంగ్రెస్‌ పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్‌ రెడ్డి నేతృత్వంలో పనిచేస్తున్న ప్రభుత్వం అర్హు లైన నిరుపేదలకు అందజేస్తున్న ఇందిరమ్మ ఇళ్లు, పెన్షన్లు, రేషన్‌ కార్డుల పంపిణీ, రైతు భరోసా అమలు చేస్తు న్నట్లు తెలిపారు. రా నున్న స్థానిక సంస్థ ల ఎన్నికల్లో మండ లంలోని అన్ని స్థానా లలో కాంగ్రెస్‌ పార్టీ నీ భారీ మెజార్టీతో గెలి పించే విధంగా కాంగ్రె స్‌ నాయకులు, కార్యకర్తలు సమన్వయంతో పని చేయాలని సూచించారు. అంతకముందు ముం దు అమ్రాబాద్‌లో ప్రధాన రహదారి నిర్మా ణంలో భాగంగా నూతనంగా నిర్మించునున్న మురుగునీటి కాల్వ పనులకు ఎమ్మెల్యే భూమి పూజ చేశారు. అదేవిధంగా స్థానిక ప్రభుత్వ డిగ్రీ కళాశాలను ఎమ్మెల్యే తనిఖీ చేసి అధ్యాపకులు, విద్యార్థులతో మాట్లాడారు. కార్యక్ర మంలో కాంగ్రెస్‌ మండల అధ్యక్షుడు హరి నారాయణగౌడ్‌, అచ్చంపేట వ్యవసాయ మార్కె ట్‌ కమిటీ వైస్‌ చైర్మన్‌ రాసుమల్లు వెంకటయ్య, కాంగ్రెస్‌ నాయకులు కుంద మల్లికార్జున్‌, బాల్‌ లింగం గౌడ్‌, చింతల రాజగోపాల్‌, రహీం, రేనయ్య, లక్ష్మణచారి పాల్గొన్నారు.

Updated Date - Jun 28 , 2025 | 11:19 PM