సంఘటితంగా పోరాటాలకు సిద్ధం కావాలి
ABN , Publish Date - Nov 16 , 2025 | 11:37 PM
సీఐటీయూ కార్మి కులు సంఘటితంగా పోరాటాలకు సిద్ధం కావాలని సీఐటీయూ జిల్లా కార్యదర్శి ఆర్.శ్రీనివాసులు అన్నారు.
- సీఐటీయూ జిల్లా కార్యదర్శి ఆర్.శ్రీనివాసులు
తాడూరు, నవంబరు 16 (ఆంధ్రజ్యోతి) : సీఐటీయూ కార్మి కులు సంఘటితంగా పోరాటాలకు సిద్ధం కావాలని సీఐటీయూ జిల్లా కార్యదర్శి ఆర్.శ్రీనివాసులు అన్నారు. తాడూరులో సీఐటీయూ ఆధ్వర్యంలో మండల మహాసభ ఆదివారం నిర్వహించారు. కార్మికుల కు పని గంటల భారాన్ని తగ్గించాలని, ఈఎస్ ఐ, పీఎఫ్ సౌకర్యం కల్పించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో సుచిత్ర, శశి కళ, పరశురాం, ఎండీ కైరత్, పరశురాం, బాల య్య, సుబ్బయ్య, కేవీపీఎస్ జిల్లా అధ్యక్షుడు అంతటి కాశన్న పాల్గొన్నారు.