Share News

విద్యారంగ సమస్యలపై ఐక్యంగా పోరాడాలి

ABN , Publish Date - Dec 13 , 2025 | 11:23 PM

ఉపా ధ్యాయుల సమస్యల పరిష్కా రానికి ఐక్యంగా ఉద్యమించా లని తెలంగాణ ప్రాంత ఉపా ధ్యాయ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు వెంకట్‌రెడ్డి అన్నారు.

విద్యారంగ సమస్యలపై ఐక్యంగా పోరాడాలి
మాట్లాడుతున్న తపస్‌ జిల్లా అధ్యక్షుడు దెంది రాజారెడ్డి

- తపస్‌ రాష్ట్ర ఉపాధ్యక్షుడు వెంకట్‌రెడ్డి

- తపస్‌ జిల్లా నూతన కార్యవర్గం ఎన్నిక

నాగర్‌కర్నూల్‌ టౌన్‌, డిసెం బరు 13 (ఆంధ్రజ్యోతి): ఉపా ధ్యాయుల సమస్యల పరిష్కా రానికి ఐక్యంగా ఉద్యమించా లని తెలంగాణ ప్రాంత ఉపా ధ్యాయ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు వెంకట్‌రెడ్డి అన్నారు. శనివారం జిల్లా కేంద్రంలోని శిశు మందిర్‌ పాఠశాలలో తపస్‌ నూతన కార్యవర్గా న్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఎన్నికల పరిశీ లకుడు బాలరాజు ఆధ్వర్యంలో తపస్‌ జిల్లా నూతన అధ్యక్షుడిగా దెంది రాజారెడ్డి, ప్రధాన కార్యదర్శిగా శేఖర్‌ ముదిరాజ్‌ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. జిల్లా నూతన అధ్యక్షుడు దెంది రాజారెడ్డి మాట్లాడుతూ తన మీద ఎంతో న మ్మకంతో తపస్‌ రాష్ట్ర కమిటీ జిల్లా అధ్యక్షుడిగా నియమించడం సంతోషంగా ఉందని దన్యవా దాలు తెలిపారు. ప్రభుత్వం తక్షణమే ఉపాధ్యా యులకు పెండింగ్‌లో ఉన్న బకాయిలు విడు దల చేయాలని, పీఆర్‌సీ, డీఏలను ప్రకటించా లని, సీపీఎస్‌ను రద్దు పరిచి ఓపీఎస్‌ను అమ లు చేయాలని, పదో తరగతి పరీక్షల షెడ్యూ ల్‌ను రివైజ్డ్‌ చేయాలని కోరారు. కార్యక్రమంలో తపస్‌ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కొంగరి శ్రీని వాసులు రాష్ట్ర అకడమిక్‌ కోకన్వీనర్‌ పెంట్యానా యక్‌, సీనియర్‌ నాయకులు మురళీధర్‌రెడ్డి, ప్రవీణ్‌రెడ్డి, అరవింద్‌రావు, జగదీశ్వర్‌, నరేందర్‌ రెడ్డి, నాగరాజు, జగదీశ్వర్‌రెడ్డి, బుక్క వెంకటే శ్వర్లు, నర్సిరెడ్డి, రాజశేఖర్‌రావు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Dec 13 , 2025 | 11:23 PM