kumaram bheem asifabad- స్థానిక సంస్థల ఎన్నికల్లో సత్తాచాటాలి
ABN , Publish Date - Jun 18 , 2025 | 11:32 PM
రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా యూత్ కాంగ్రెస్ సభ్యులు సత్తాచాటాలని యూత్ కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు జక్కడి శివచరణ్‌రెడ్డి అన్నారు. జిల్లా పర్యటనలో భాగంగా జిల్లా కేంద్రంలోని జిల్లా యూత్ అధ్యక్షుడు గుండా శ్యాం అధ్యక్షతన జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయ ఆవరణలో నిర్వహించిన కార్యకర్తల సమావేశానికి యూత్ కాంగ్రెస్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎస్.తామస్, రాష్ట్ర ఇన్‌చార్జి ఖలీద్ అహ్మద్‌తో కలిసి ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
ఆసిఫాబాద్‌రూరల్, జూన్ 18 (ఆంధ్రజ్యోతి): రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా యూత్ కాంగ్రెస్ సభ్యులు సత్తాచాటాలని యూత్ కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు జక్కడి శివచరణ్‌రెడ్డి అన్నారు. జిల్లా పర్యటనలో భాగంగా జిల్లా కేంద్రంలోని జిల్లా యూత్ అధ్యక్షుడు గుండా శ్యాం అధ్యక్షతన జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయ ఆవరణలో నిర్వహించిన కార్యకర్తల సమావేశానికి యూత్ కాంగ్రెస్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎస్.తామస్, రాష్ట్ర ఇన్‌చార్జి ఖలీద్ అహ్మద్‌తో కలిసి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమంలో యువజన కాంగ్రెస్ నాయకులు కీలక పాత్ర పోషించారని అన్నారు. రాష్ట్ర ఆవిర్భావం తరువాత కూడా గత పది సంవత్సరాల్లో బీఆర్‌ఎస్‌ను ఎదుర్కొని పార్టీ అధికారంలోకి తీసుకు వచ్చినట్లు తెలిపారు. రానున్న స్థానిక సంస్థల్లో ఎన్నికల్లో గెలుపు కోసం బాధ్యత తీసుకోవాలన్నారు. ఇచ్చిన హామిలు అమలు చేయడం కాంగ్రెస్‌తోనే సాధ్యమవుతుందన్నారు. భారత్ జోడో యాత్రలో భాగంగా రాహుల్ గాంధీ ఇచ్చిన హామీ మేరకు కులగణన ఏయడంతో పాటు బీసీలకు 43 శాతం రిజర్వేషన్, ఎస్సీ వర్గీకరణ లాంటి చారిత్రాత్మక నిర్ణయాలు తీసుకున్నట్లు తెలిపారు. అనంతరం నాయకులు, కార్యకర్తలతో ఆయన ప్రతిజ్ఞ చేయించారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే ఆత్రం సక్కు, నాయకులు అనీల్‌గౌడ్, చరణ్, సాయి, షేక్ ఖలీమ్, సలీం, జావీద్, కార్తీక్, శైలేందర్ పాల్గొన్నారు.