ఉత్తమ పౌరులుగా లక్ష్యాన్ని చేరుకోవాలి
ABN , Publish Date - Dec 20 , 2025 | 11:16 PM
మంచిగా చ దువుకొని, ఉత్తమ పౌరులుగా ఎదిగి నిర్దేశించుకున్న లక్ష్యా లను చేరుకోవాలని కొల్లాపూర్ కోర్టు ప్రధాన జూనియర్ సివి ల్ న్యాయాధికారి దమ్ము ఉప నిషధ్వాని అన్నారు.
- జూనియర్ సివిల్ న్యాయాధికారి దమ్ము ఉప నిషధ్వాని
కొల్లాపూర్, డిసెంబరు 20 (ఆంధ్రజ్యోతి) : మంచిగా చ దువుకొని, ఉత్తమ పౌరులుగా ఎదిగి నిర్దేశించుకున్న లక్ష్యా లను చేరుకోవాలని కొల్లాపూర్ కోర్టు ప్రధాన జూనియర్ సివి ల్ న్యాయాధికారి దమ్ము ఉప నిషధ్వాని అన్నారు. కొల్లాపూర్ రెసిడెన్షియల్‌లో విద్యార్థులకు ఏర్పాటు చేసిన సదస్సులో రెండవ అదనపు జూనియర్ సివిల్ న్యాయాధికారి శరణ్య, కళా శాల ప్రిన్సిపాల్ కవితతో కలిసి న్యాయ విజ్ఞాన సదస్సులో దమ్ము ఉపనిషద్వాని పాల్గొన్నారు. విద్యార్థినులను ఉద్దేశించి ఆమె మాట్లాడుతూ పోక్సో చట్టం, రాజ్యాంగం ద్వారా సంక్రమించిన విద్యాహక్కు చట్టం గురించి వివరించారు. స మాజంలో ఆడపిల్లలు స్వీయరక్షణ కలిగి ఉం డాలని తెలిపారు. 2వ అదనపు జూనియర్ సివిల్ న్యాయాధికారి శరణ్య మాట్లాడుతూ పర్యావరణాన్ని మన చేతులారా పాడు చేస్తున్నామని, ప్రతీ ఒక్కరు విధిగా పర్యావరణ పరిరక్షణకు మొక్కలు నాటాలని తెలిపారు. సమావేశానికి న్యాయవాది రాజేష్, న్యాయశాఖ సిబ్బంది, లోక్ అదాలత్ సిబ్బంది, కళాశాల బో ధన, బోధనేతర సిబ్బంది, పారా లీగల్ వాలం టీర్ హాజరయ్యారు. అనంతరం కళాశాల ప్రాం గణంలో న్యాయాధికారులు మొక్కలు నాటారు. అనంతరం న్యాయాధికారులు జూనియర్ సివిల్ కోర్టు ప్రాంగణంలో న్యాయ శాఖ సిబ్బందితో కలిసి మొక్కలు నాటారు.