అభివృద్దే ఎజెండాగా పనిచేస్తున్నాం
ABN , Publish Date - Jul 28 , 2025 | 11:36 PM
ప్రజల సంక్షేమం, గ్రామాల అభివృద్ధే అజెండా పనిచేస్తున్నామని బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం వినోద్ అన్నారు. నియోజకవర్గంలో గతం లో కనివిని ఎరుగని అభివృద్ధి పనులు నడు స్తుండటమే అందుకు నిదర్శనమన్నారు.
-ఎమ్మెల్యే గడ్డం వినోద్
నెన్నెల, జులై 28 (ఆంధ్రజ్యోతి) : ప్రజల సంక్షేమం, గ్రామాల అభివృద్ధే అజెండా పనిచేస్తున్నామని బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం వినోద్ అన్నారు. నియోజకవర్గంలో గతం లో కనివిని ఎరుగని అభివృద్ధి పనులు నడు స్తుండటమే అందుకు నిదర్శనమన్నారు. మండల కేంద్రంలోని రైతు వేధికలో సోమవారం నిర్వహించిన రేషన్ కార్డుల మంజూరు పత్రా లు, ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు మొదటి విడత బిల్లుల చెక్కుల పంపి ణీ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. దశాబ్దకాలంగా రేషన్‌కార్డుల కోసం నిరీక్షిస్తున్న పేదల్లో కాంగ్రెస్ ప్రభుత్వం సంతోషాన్ని నింపిందన్నారు. రేషన్‌కార్డుల జారీ ప్రక్రియ నిరంతరంగా కొనసాగుతుం దని, కార్డులు రాని వారు దరఖాస్తు చేసుకుంటే వెంటనే మంజూరు చేస్తారని అన్నారు. నెన్నెల మండలానికి నిధుల మంజూరుకు రాజీ పడేది లేదని, అవసరమైన పనులకు అంచనాలు రూపొందించి ఇవ్వాలని కోరారు. అధికారులు, నాయకులు సమన్వయంతో పనులు చేయాలని సూచించారు. 221 మందికి కొత్త రేషన్‌కార్డుల మంజూరు పత్రాలు అం దజేశారు. ఈ కార్యక్రమంలో ఆర్డీవో హరికృష్ణ, తహసీల్దార్ జ్యోతి, ఎంపీ డీవో అబ్దుల్ హై, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు గట్టు మల్లేష్, నా యకులు బొమ్మెన హరీష్‌గౌడ్, శ్రీనివాస్, మల్లాగౌడ్ పాల్గొన్నారు.
అటవీ అధికారులపై ఎమ్మెల్యేకు ఫిర్యాదు
అటవి అధికారులు తమను వేధిస్తున్నారని నెన్నెల గిరిజనులు ఎమ్మె ల్యే వినోద్‌కు ఫిర్యాదు చేశారు. పోడు భూముల్లో పంటలను ద్వంసం చే స్తూ సాగును అడ్డుకుంటున్నారని అన్నారు. సోమవారం నెన్నెల మండ ల కేంద్రంలో తమకు న్యాయం చేయాలని కోరుతూ ఎమ్మెల్యేకు వినతి పత్రం అందజేశారు. నెన్నెల శివారు సర్వే నంబరు 672లో తమకు పట్టా లు ఉన్నాయని, దశాబ్దాల కాలం నుంచి సాగు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నామని చెప్పారు. ముఖ్యమంత్రి, సంబందిత ఉన్నతాధికారుతో మాట్లాడి పోడు సమస్యను పరిష్కరిస్తానని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. కాంగ్రెస్ నాయకులు బొమ్మెన హరీష్‌గౌడ్ ఉన్నారు.