Share News

రాష్ట్రంలో విద్యావ్యవస్థను బలోపేతం చేస్తున్నాం

ABN , Publish Date - Nov 12 , 2025 | 11:15 PM

రాష్ట్రంలో విద్యా వ్యవస్థను బలోపేతం చేస్తున్నామని రాష్ట్ర కార్మిక, ఉపాధి శిక్షణ, కర్మాగార, గను లు, భూగర్భ శాఖ మంత్రి గడ్డం వివేక్‌వెంకటస్వామి పేర్కొన్నారు. బుధవారం మండల కేంద్రంలోని కేజీబీవీ బాలికల విద్యాలయంలో నూతనంగా నిర్మించిన జూనియర్‌ కళాశాల గదులను కలెక్టర్‌ కుమా ర్‌ దీపక్‌తో కలిసి ప్రారంభించారు.

రాష్ట్రంలో విద్యావ్యవస్థను బలోపేతం చేస్తున్నాం
మంత్రి వివేక్‌వెంకటస్వామికి పుష్పగుచ్చం ఇస్తున్న ప్రిన్సిపాల్‌, విద్యార్థినులు

-మంత్రి వివేక్‌వెంకటస్వామి

జైపూర్‌, నవంబరు 12 (ఆంధ్రజ్యోతి) : రాష్ట్రంలో విద్యా వ్యవస్థను బలోపేతం చేస్తున్నామని రాష్ట్ర కార్మిక, ఉపాధి శిక్షణ, కర్మాగార, గను లు, భూగర్భ శాఖ మంత్రి గడ్డం వివేక్‌వెంకటస్వామి పేర్కొన్నారు. బుధవారం మండల కేంద్రంలోని కేజీబీవీ బాలికల విద్యాలయంలో నూతనంగా నిర్మించిన జూనియర్‌ కళాశాల గదులను కలెక్టర్‌ కుమా ర్‌ దీపక్‌తో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లా డుతూ ప్రభుత్వం రాష్ట్రంలోని విద్యావ్యవస్థను బలోపేతం చేస్తూ ప్ర భుత్వ పాఠశాలలు, కళాశాలలను అభివృద్ధి చేసి సకల సౌకర్యాల తో విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందిస్తుందన్నారు. ప్రభుత్వం కల్పి స్తున్న అవకాశాలను వినియోగించుకుని విద్యార్థులు ఏకాగ్రతతో చ దువుకుని ఉన్నత స్థాయికి చేరుకోవాలన్నారు. విద్యతోనే సమాజంలో మంచి గుర్తింపు వస్తుందన్నారు. విద్యతో పాటు క్రీడల్లో రాణించాల ని, కమ్యూనికేషన్‌ స్కిల్స్‌ పెంపొందించుకోవాలన్నారు. ప్రభుత్వం విద్యాభివృద్ధికి ప్రభుత్వ పాఠశాలల్లో 51 వేల మంది ఉపాధ్యాయు లను నియమించిందన్నారు. అనంతరం కలెక్టర్‌ కుమార్‌ దీపక్‌ మా ట్లాడుతూ ప్రభుత్వ విద్య, వైద్య రంగాలకు అధిక ప్రాధాన్యత ఇస్తుం దని, ప్రభుత్వ పాఠశాలల్లో అవసరమైన తాగునీరు, మూత్రశాలలు, మరుగుదొడ్లు, ప్రహారీ గోడ తదితర సౌకర్యాలను కల్పించామన్నారు. రూ. 2.5 కోట్లతో చేపట్టిన జూనియర్‌ కళాశాల అదనపు గదుల్లో త రగతి గదులు, ల్యాబ్‌ ఇతర సౌకర్యాలు కల్పించామన్నారు. జిల్లాలో ని కేజీబీవీ విద్యాలయాల్లో విద్యనభ్యసించి ఎంబీబీఎస్‌ సీట్లు సాధిం చడం అభినందనీయమన్నారు. ఈ విద్యార్థులను స్ఫూర్తిగా తీసుకో వాలన్నారు. అనంతరం 41 మంది లబ్దిదారులకు కల్యాణలక్ష్మీ, షాది ముబారక్‌ చెక్కులను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో డీఈవో యాదయ్య, తహసీల్దార్‌ వనజారెడ్డి, ఎంపీడీవో సత్యనారాయణ, ఎం ఈవో శ్రీనివాస్‌, కేజీబీవీ ఎస్‌వో ఫణిబాల పాల్గొన్నారు.

Updated Date - Nov 12 , 2025 | 11:15 PM