Share News

ప్రజల రక్షణకు అన్ని ఏర్పాట్లతో సిద్ధంగా ఉన్నాం

ABN , Publish Date - Aug 14 , 2025 | 11:13 PM

వాతావరణ సూచనల మేరకు రాబోయే అతి భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నందున ప్రజ రక్షణ కోసం అన్ని ఏర్పాట్లతో సిద్దంగా ఉన్నామని జిల్లా కలెక్టర్‌ కుమార్‌ దీపక్‌ అన్నారు. మంచిర్యాల పట్టణం తిలక్‌నగర్‌ చెరువులో మంచిర్యాల డీసీపీ భాస్కర్‌తో కలిసి ఏర్పాట్లను పరిశీలించారు.

ప్రజల రక్షణకు అన్ని ఏర్పాట్లతో సిద్ధంగా ఉన్నాం
తిలక్‌నగర్‌ చెరువులో కలెక్టర్‌ కుమార్‌ దీపక్‌, డీసీపీ భాస్కర్‌ ఎఫ్‌డీఆర్‌ సిబ్బందితో బోటులో పరిశీలిస్తున్న దృశ్యం

కలెక్టర్‌ కుమార్‌ దీపక్‌

మంచిర్యాలక్రైం, ఆగస్టు 14(ఆంధ్రజ్యోతి): వాతావరణ సూచనల మేరకు రాబోయే అతి భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నందున ప్రజ రక్షణ కోసం అన్ని ఏర్పాట్లతో సిద్దంగా ఉన్నామని జిల్లా కలెక్టర్‌ కుమార్‌ దీపక్‌ అన్నారు. మంచిర్యాల పట్టణం తిలక్‌నగర్‌ చెరువులో మంచిర్యాల డీసీపీ భాస్కర్‌తో కలిసి ఏర్పాట్లను పరిశీలించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ భారీ వర్షాల నేపథ్యంలో వరద పరిస్థితులను ఎదుర్కొనేందుకు ప్రజల రక్షణ కోసం అన్ని ఏర్పాట్లతో సిద్దంగ ఉన్నామని తెలిపారు. జిల్లాలోని కాజ్‌వేలు వాగులు, నదుల వద్దకు ప్రజలు ఎవరు వెళ్లకుండా పోలీసు, రెవెన్యూ పంచాయతీశాఖల అధికారులు సమన్వయంతో పని చేయాలన్నారు. లోతట్టు ప్రాంతాల్లో బందోబస్తు ఏర్పాట్లు చేశామన్నారు. పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేసి తగు చర్యలు తీసుకున్నామన్నారు. జిల్లాలో వరదలకు సంబంధించి ఎలాంటి సమస్య వచ్చిన ఎదుర్కొనేందుకు 90 మంది సభ్యలతో మూడు ఎఫ్‌డీఆర్‌ ఎస్‌ బృందాలు జిల్లా అధికారులతో సిద్దంగా ఉన్నామన్నారు. ప్రజల రక్షణకు కావాల్సిన పరికరాలు అందుబాటులో పెంచడం జరిగిందని పోలీసు అధికారులకు శిక్షణ అందించామన్నారు. గజ ఈతగాళ్లను సిద్దంగా ఉంచామని తెలిపారు. ప్రభుత్వ సూచన మేరకు మత్స్యకారులు చేపలవేటకు వెళ్లకూడదని జిల్లాలోని పాఠశాలలకు గురువారం సెలవు ప్రకటించామన్నారు. జిల్లాలో ప్రాణనష్టం, పశునష్టం, ఆస్తినష్టం జరుగకుండా సంబంధిత అధికారులు చర్యలు తీసుకోవాలని ఉన్నతాధికారుల మార్గదర్శకాలను పాటిస్తూ ప్రజల రక్షణకు కృషి చేయాలని తెలిపారు. ఈకార్యక్రమంలో సంబంధిత అధికారులు పాల్గొన్నారు.

Updated Date - Aug 14 , 2025 | 11:13 PM