ఇచ్చిన హామీలన్ని నెరవేరుస్తున్నాం
ABN , Publish Date - Jun 27 , 2025 | 11:35 PM
ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలన్నీ నెరవేరుస్తున్నామని బెల్లంపల్లి ఎమ్మెల్యే వినోద్‌వెంకటస్వామి పేర్కొన్నారు. శుక్రవారం మండలంలోని నీల్వాయి గ్రామంలో ఇంటర్ ఒకేషనల్ కోర్సు ఎంఎల్‌టీ తరగతులను కలెక్టర్ కుమార్ దీపక్‌తో కలిసి ప్రారంభించారు.
వేమనపల్లి, జూన్ 27 (ఆంధ్రజ్యోతి) : ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలన్నీ నెరవేరుస్తున్నామని బెల్లంపల్లి ఎమ్మెల్యే వినోద్‌వెంకటస్వామి పేర్కొన్నారు. శుక్రవారం మండలంలోని నీల్వాయి గ్రామంలో ఇంటర్ ఒకేషనల్ కోర్సు ఎంఎల్‌టీ తరగతులను కలెక్టర్ కుమార్ దీపక్‌తో కలిసి ప్రారంభించారు. అలాగే కస్తూర్బా విద్యాలయంలో రూ. 66 లక్షలతో అదనపు గదుల నిర్మాణానికి శంకుస్ధాపన చేశారు. అనంతరం వేమనపల్లిలో నిర్వహించిన 33/11కేవీ విద్యుత్ సబ్‌స్టేషన్‌ను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ విద్యార్ధినీల కోసం ప్రభుత్వం అనేక వసతులు కల్పిస్తుందని, శ్రద్ధగా చదువుకుని భవిష్య త్‌లో ఉన్నత స్థాయికి చేరుకోవాలన్నారు. ఏమైనా సమస్యలుంటే తన దృష్టికి తీసుకువస్తే పరిష్కరించేందుకు కృషి చేస్తానన్నారు. మండలాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తున్నానని తెలిపారు. గత ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు మండలానికి జూనియర్ కాలేజీ, ఒకేషనల్ ఎంఎల్‌టీ కాలేజీ తీసుకువచ్చి మాట నిలబెట్టుకున్నానన్నారు. నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయడానికి ప్రణాళికలతో ముందుకు వెళ్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ జెడ్పీటీసీ సంతోష్ కుమార్, మండల కాంగ్రెస్ అధ్యక్షుడు సయ్యద్ సాబీర్ ఆలీ, ఎంఆర్‌పీఎస్ జిల్లా అధ్యక్షుడు చెన్నూరి సమ్మయ్యమాదిగ, విద్యుత్ జిల్లా అధికారి గంగారాం, తహసీల్దార్ సంధ్యారాణి, ఎంపీడీవో కుమారస్వామి, మాజీ ఎంపీపీ కుర్రు వెంకటేష్, లింగాగౌడ్, నాయకులు రాజన్న, గాలి మధు, తోకల రాంచందర్, సత్యనారాయణ, జహీద్ ఆలీ, పురుషోత్తం, మధుసూదన్, పున్నం , కార్యకర్తలు పాల్గొన్నారు.