ప్రజలకు ఇచ్చిన మాటకు కట్టుబడి ఉన్నాం
ABN , Publish Date - Apr 15 , 2025 | 10:47 PM
ప్రజలకు ఇచ్చిన మాటకు కట్టుబడి ఉన్నామని పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీక్రిష్ణ అన్నారు. మంగళవారం క్యాతన్‌పల్లి రైల్వే ఫ్లైఓవర్ బ్రిడ్జి ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా హాజరై ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు. క్యాతన్‌పల్లి ప్రజల దశాబ్ధకాలంగా ఎదురు చూస్తున్న ఫ్లైఓవర్ బ్రిడ్జి నిర్మాణం ప్రారంభోత్సవం ప్ర జల ఆకాంక్షను నెరవేర్చేందుకు చెన్నూర్ ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి ఎంతో కృషి చేశారన్నారు.

- క్యాతన్‌పల్లి ఫ్లైఓవర్ బ్రిడ్జి ప్రారంభోత్సవంలో ఎమ్మెల్యే, ఎంపీ
రామకృష్ణాపూర్, ఏప్రీల్15(ఆంరఽధజ్యోతి): ప్రజలకు ఇచ్చిన మాటకు కట్టుబడి ఉన్నామని పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీక్రిష్ణ అన్నారు. మంగళవారం క్యాతన్‌పల్లి రైల్వే ఫ్లైఓవర్ బ్రిడ్జి ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా హాజరై ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు. క్యాతన్‌పల్లి ప్రజల దశాబ్ధకాలంగా ఎదురు చూస్తున్న ఫ్లైఓవర్ బ్రిడ్జి నిర్మాణం ప్రారంభోత్సవం ప్ర జల ఆకాంక్షను నెరవేర్చేందుకు చెన్నూర్ ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి ఎంతో కృషి చేశారన్నారు. ఆనాడు కాకా వెంకట స్వామి సింగరేణి ప్రాంతంలో అనేక సంక్షేమ పథకాలను కార్మికుల కోసం వారి హక్కుల కోసం పని చేశాడని నేడు కాకా వారసత్వాన్ని కొనసాగించేందుకు చెన్నూర్, బెల్లంపల్లి, పెద్దపల్లి పార్లమెంట్ నియోజకవర్గాల్లో అభివృద్ధి సంక్షేమ పథకా లను అందించడంలో వెనుకాడబోనని అన్నారు. ఎన్నికల సమయంలో క్యాతన్‌పల్లి, రామకృష్ణాపూర్ మంచిర్యాల ప్రాంతా నికి ప్రధానంగా ఉన్న బ్రిడ్జి సమస్యను పరిశీలించిన వెంటనే అధికారంలోకి వచ్చిన వెంటనే బ్రిడ్జి నిర్మాణం పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకొస్తామని మాట ఇచ్చామని అది నిలబెట్టుకున్నామన్నారు. అదే విధంగా సింగరేణి కార్మి కులకు పింఛన్ స్కీమ్‌ను పదివేలకు పెంచాలని పార్లమెంట్‌లో ఈ ప్రాంత ప్రజల హక్కును సంబంధిత మంత్రికి విన్న వించామన్నారు. అనంతరం చెన్నూర్ ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి మాట్లాడుతూ ఎన్నికల్లో గెలిచిన వెంటనే బ్రిడ్జిని ప్రారంభించేందుకు సన్నహాలు చేపట్టి కాంట్రా క్టర్‌కు రావాల్సిన నిధులు, భూ నిర్వాసితులకు అందాల్సిన నష్టపరిహారాన్ని పూర్తి స్థాయిలో అందించిన వెంటనే బ్రిడ్జి పనులు వేగవంతమయ్యాయన్నారు. ప్రజల ఆకాంక్షను నెరవేర్చడం ప్రజా ప్రతినిధిగా నాకర్తవ్యమని, అదే విధంగా మున్సి పాలిటిలోని రోడ్లు, డ్రైనేజీలు, మంచినీటి సౌకర్యం కోసం ప్రత్యేక నిధులను మం జూరు చేయించి అభివృద్ధి పనులు చేపడుతామన్నారు. ఈప్రారంభోత్సవానికి కలెక్టర్ కుమార్ దీపక్, పట్టణ అధ్య క్షుడు పల్లె రాజు, టీపీసీసీ ప్రధాన కార్యదర్శి రఘు నాథ్ రెడ్డి, అధికార ప్రతినిధి శ్రీనివాస్, మాజీ మున్సిపల్ చైర్మన్ జంగం కళ, మాజీ వైస్ చైర్మన్ సాగర్‌రెడ్డి, నాయకులు అబ్దుల్ అజీజ్, యాకూబ్ అలీ, బీరం శ్రీనివాస్‌గౌడ్, గాండ్ల సమ్మయ్య, కౌన్సిలర్లు, నాయకులు పాల్గొన్నారు.