Share News

స్థానిక సంస్థల ఎన్నికలను బహిష్కరిస్తున్నాం

ABN , Publish Date - Oct 06 , 2025 | 11:32 PM

స్థానిక సంస్థల ఎన్నికల నోటి ఫికేషన్‌ నేపథ్యంలో వందుర్‌గూడ, వెంకటాపూర్‌ పంచాయతీలకు వేరు వే రుగా నోటిఫికేషన్‌ వెలువరించటాన్ని వ్యతిరేకిస్తూ వందూర్‌గూడ గిరిజ నులు ఆదివారం రాత్రి సమావేశమై స్థానిక సంస్థల ఎన్నికలను బహిష్కరి స్తున్నట్లు తీర్మానం చేశారు.

స్థానిక సంస్థల ఎన్నికలను బహిష్కరిస్తున్నాం
వందూర్‌గూడలో నిరసన ఆందోళన చేస్తున్న గిరిజనులు

వందుర్‌గూడ్‌ గిరిజనుల తీర్మానం..

దండేపల్లి అక్టోబరు 6 (ఆంధ్రజ్యోతి): స్థానిక సంస్థల ఎన్నికల నోటి ఫికేషన్‌ నేపథ్యంలో వందుర్‌గూడ, వెంకటాపూర్‌ పంచాయతీలకు వేరు వే రుగా నోటిఫికేషన్‌ వెలువరించటాన్ని వ్యతిరేకిస్తూ వందూర్‌గూడ గిరిజ నులు ఆదివారం రాత్రి సమావేశమై స్థానిక సంస్థల ఎన్నికలను బహిష్కరి స్తున్నట్లు తీర్మానం చేశారు. వందూర్‌గూడ గ్రామ పటేల్‌ దౌలత్‌రావు మొ కాసి మాట్లాడుతూ గతంలో దండేపల్లి మండలం వెంకటాపూర్‌ పంచా యతీలో వందుర్‌గూడ కొనసాగింది. 2018లో అధికారుల తప్పుడు నివే దికతో వందూర్‌గూడను వెంకటాపూర్‌ జీపీ నుంచి వేరు చేసి కొత్త గ్రామ పంచాయతీగా ఏర్పాటు చేశారు. వందూర్‌గూడను వెంకటాపూర్‌ జీపీలో కొనసాగించాలని ఇటీవల కోర్టులో ఫిటిషన్‌ వేశామన్నారు. అధికారులు మ ళ్లీ పరిశీలించి నిర్ణయం తీసుకోవాలని న్యాయస్థానం అధికారులకు ఆదేశా లు జారీ చేసి నెల రోజు కావాస్తున్న ఎలాంటి చర్యలు తీసు కోలేదన్నారు. ఇటీవల స్థానిక సంస్థల ఎన్నికల నోటిఫికేషన్‌ను ఈ రెండు జీపీలకు వేరు వేరుగా వెలువరించడం పట్ల వందుర్‌గూడ్‌ గిరిజనలు ఆగ్రహం వ్యక్తం చే శారు. దీంతో తామంతా స్థానిక సంస్థల ఎన్నికలను బహిష్కరిస్తున్నామని తీర్మానించారు. కార్యక్రమంలో వందుర్‌గూడ గిరిజనులు కోవ ధర్మరావు, మారుతీ, ఆడ చందు, కుంరం బాపురావు, పెంద్రం హేమంత్‌, సేడ్మకి తి రుపతి, గిరిజనులు పాల్గొన్నారు.

Updated Date - Oct 06 , 2025 | 11:32 PM