Share News

kumaram bheem asifabad- ప్రకృతి సిగలో జల సోయగం

ABN , Publish Date - Jul 26 , 2025 | 11:09 PM

ప్రకృతి అందాల్లో జలధారల ప్రత్యేకతే వేరు. అలాంటి నిలువెత్తు నీటి సౌందార్యాన్ని ఆస్వాదించా లంటే జలపాతాలను మించిన మార్గం లేదు. ఆ తెల్లని నీళ్ల సిరులను కళ్లకు హత్తుకోవాలంటే మాన్‌ సూన్‌ని మించిన సీజన్‌ లేదు. మిగిలిన అన్ని కాలాల్లోనూ పొడి పొడిగా, సాదాసీదాగా కనిపించే ప్రాం తాలు.. వర్షాకాలంలో మాత్రం హర్షామోదాల కేరింతల నిలయాలుగా మారిపోతాయి. ఈ సీజన్‌లో నప్పే ట్రిప్స్‌గా జలధారల దారి పట్టేవారి కోసం జిల్లాలో అందుబాటులో ఉన్న కొన్ని జలపాతాల విశేషాలివి..

kumaram bheem asifabad- ప్రకృతి సిగలో జల సోయగం
ఉరకలేస్తున్న లింగాపూర్‌లోని మిట్టే జలపాతం

- కొండకోనల్లో జలపాతాల గలగలలు

- అబ్బురపరుస్తున్న ఆహ్లాదకర వాతావరణం

- ఆస్వాదిస్తున్న పర్యాటకులు

- రవాణా, మౌలిక వసతుల లేమితో మరుగున పడుతున్న వైనం

ప్రకృతి అందాల్లో జలధారల ప్రత్యేకతే వేరు. అలాంటి నిలువెత్తు నీటి సౌందార్యాన్ని ఆస్వాదించా లంటే జలపాతాలను మించిన మార్గం లేదు. ఆ తెల్లని నీళ్ల సిరులను కళ్లకు హత్తుకోవాలంటే మాన్‌ సూన్‌ని మించిన సీజన్‌ లేదు. మిగిలిన అన్ని కాలాల్లోనూ పొడి పొడిగా, సాదాసీదాగా కనిపించే ప్రాం తాలు.. వర్షాకాలంలో మాత్రం హర్షామోదాల కేరింతల నిలయాలుగా మారిపోతాయి. ఈ సీజన్‌లో నప్పే ట్రిప్స్‌గా జలధారల దారి పట్టేవారి కోసం జిల్లాలో అందుబాటులో ఉన్న కొన్ని జలపాతాల విశేషాలివి..

ఆసిఫాబాద్‌, జూలై 26 (ఆంధ్రజ్యోతి): జిల్లాలోని అటవీ ప్రాంతాల్లో సహజ సిద్ధంగా ఏర్పడిన జలపా తాలు ఆకట్టుకుంటున్నాయి. జిల్లాలో గత కొన్ని రోజులుగా కురుస్తున్న వర్షాలకు అటవీ ప్రాంతాల్లో సహజ సిద్ధంగా ఏర్పడిన జలపాతాలు జాలువారుతూ జలకళను సంతరించుకోవడంతో సందర్శకుల తాకిడి పెరిగింది. దీంతో జలపాతాల సందర్శనకు వచ్చే సందర్శకులు తగు జాగ్రత్తలు పాటించాలని అధికారులు సూచిస్తున్నారు. ప్రకృతి సోయగాల ఆసిఫాబాద్‌ జిల్లా అటవీ ప్రాంతాల్లో పర్యాటక అభివృద్ధికి అద్భుతమైన అవకాశాలు ఉన్నాయి. ప్రభుత్వం ఏ మాత్రం ఆదరణ చూపినా తెలంగాణ కాశ్మీర్‌గా ఘనతకెక్కిన ఈ ప్రాంతం పర్యాటక శోభను సంతరించుకుంటుందనడంలో ఎలాంటి సందేహం అక్క ర్లేదు. పర్యాటకాన్ని అభివృద్ధి చేస్తే ఈ ప్రాంతంలో అభివృద్ధి వేగవంతం కావడంతో పాటు ఉపాధి అవకాశాలు లేక దుర్భర జీవితాలను గడుపుతున్న అడవి బిడ్డల ఉపాధి అవకాశాలు కూడా పెరిగే అవకాశం ఉంది. ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖ జిల్లా అరుకు లోయను మించి పర్యాటకులను ఆకర్షించే అద్భుతమైన వింతలు, విశేషాలు ఈ ప్రాం తంలో నిండుగా ఉన్నా వెలుగుకు నోచుకోకుండా ఉన్నాయి. అలాంటి ప్రదేశాలను అభివృద్ధి చేసి ప్రాచూర్యం కల్పిస్తే రాష్ట్రంలోనే కాకుండా దేశ వ్యాప్తంగా వివిధ రాష్ట్రాలకు చెందిన పర్యాటకులను ఆకర్షించవచ్చు.

- పచ్చని గుట్టలు..

చుట్టూ ఎత్తైన పచ్చని గుట్టలు... పక్షుల కిలకిలరావాలు.. గలగల పారే సెలయేటి సవ్వళ్లు.. గుట్టల మీది నుంచి కిందికి జాలువారుతున్న నీటి సెలయేర్లు ప్రకృతి రమణీయతకు అద్దం పట్టే విధంగా పర్యాటకులను మనసుకు హద్దుకునే జలపాతాలు. పర్యాటక ప్రేమికులకు కనబడకుండా అటవీ తల్లి ఒడిలో ఎన్నో జలపాతాలు జిల్లాలో విరివిగా ఉన్నాయి. ఈ దృశ్యా లు ఓ అద్భుతం. అది ఒక ప్రకృతి సోయగం. ఇలాంటి సుందర క్షేత్రాలకు ఆదరణ కొరవడడంతో బాహ్యాప్రపంచానికి ఈ అందాల జలపాతాల సోయగాలు పర్యాటక ప్రేమికులకు తెలియకుండా మరుగున పడిపోతున్నాయి. ప్రభుత్వం ప్రకృతి ఒడిలో దాగి ఉన్న ఈ అందాల జలపాతాలను గుర్తించి పర్యాటకంగా అభివృద్ధి పరిచినట్లయితే పర్యాటక కేంద్రాలుగా విరాజిల్లనున్నాయి.

- నీటి సెలయేళ్లు ఇవే..

ఆసిఫాబాద్‌ మండల కేంద్రం నుంచి 30 కిలో మీ టర్ల దూరంలో సమితులగుండం జలపాతం ఉంది. లింగాపూర్‌ మండలంలోని పిట్టగూడ, లింగాపూర్‌ గ్రామాల మధ్య ఉన్న మిట్టే జలపాతం సందర్శకులను కనువిందు చేస్తున్నది. సిర్పూర్‌(యూ) మండలంలోని ఎత్తైన గుట్టల నుంచి జాలువారే కుండాయి జలపాతం ప్రకృతి రమణీయతను చాటుకుంటుంది. తిర్యాణి మండలంలోని గుండాల, చింతలమాదర, ఉల్లిపిట్ట గ్రామాల సమీపంలో గుండాల, చింతలమాదర,ఉల్లిపిట్ట జలపాతాలు, వాంకిడి మండలంలోని స ర్కెపల్లి గ్రామ సమీపంలోని బుగ్గ జలపాతం ప్రకృతి రమణీయతకు ఉట్టి పడేలా కనువిందు చేస్తున్నా యి. కెరమెరి మండలంలో బాబేఝరి, కల్లెగాం గ్రామాల సమీపంలో, పెంచికల్‌పేట మండలంలోని కొండెంగా లోద్ది జలపాతాలు జాలువారుతున్నాయి.

పర్యాటకంగా అభివృద్ధి చేయాలి..

- పత్తి హరిప్రసాద్‌, ఆసిఫాబాద్‌

జిల్లాలో ప్రకృతి రమణీయతకు సజీవసాక్షాలుగా నిలుస్తున్న జలపాతాలను పర్యాట కంగా అభివృద్ధి చే యాలి. దట్టమైన అటవీ ప్రాంతాల్లో బాహ్య ప్రపంచా నికి తెలవకుండా ఎన్నో జలపాతలు జిల్లాలో ఉన్నా యి. పర్యాటక ప్రేమికులను వీటిని ఆస్వాదించేందుకు అనువైన సౌకర్యాలు లేక పోవడంతో మరుగున పడుతున్నాయి. పర్యాటకంగా అభివృద్ధి చేసినట్లయితే ప్రభుత్వానికి ఆదాయంతో పాటు పర్యాటకుల తాకిడి పెరుగనుంది.

Updated Date - Jul 26 , 2025 | 11:09 PM