Share News

వృథాగా పోతున్న నీరు

ABN , Publish Date - Jun 04 , 2025 | 12:29 AM

ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా తీసుకొచ్చిన మిషనభగీరథ పైపులైను పగిలి తాగునీరు వృథాగా పోతుంది.

 వృథాగా పోతున్న నీరు
ప్రధాన రహదారిపై వృథాగా పారుతున్న మిషన భగీరథ నీరు

వృథాగా పోతున్న నీరు

చండూరు, ఆంధ్రజ్యోతి

ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా తీసుకొచ్చిన మిషనభగీరథ పైపులైను పగిలి తాగునీరు వృథాగా పోతుంది. చండూరు మునిసిపాలిటీ పరిధిలోని 4 వ వా ర్డులో శివాజీనగర్‌తో పాటు పలు కాలనీల్లో మిషనభగీరథ పైపులైను ధ్వంసమైంది. దీంతో ప్రధాన రహదారిపై నీరు ఏరులై పారుతోంది. దీంతో వాహనదారులకు తీవ్ర ఇక్కట్లు తప్పడం లేదు. ఈ విషయంపై సంబంధిత అధికారులకు ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని కాలనీవాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయంపై మిషన భగీరథ ఏఈ సాయిచరణ్‌ వివరణ కోరగా గతంలో వాటర్‌ సప్లై కోసం పైపులైను వేశామని, వాటిపై సీసీ రోడ్డు వేయడం కారణంగా ఒత్తిడి గురై పైపులు పగిలినట్లు గుర్తించామని వెల్లడించారు. చండూరు మునిసిపాలిటీ కావడంతో పబ్లిక్‌ హెల్త్‌ డిపార్ట్‌మెంట్‌ అధికారులతో సమన్వ యం చేసుకుని సమస్యను పరిష్కరిస్తామని తెలిపారు.

Updated Date - Jun 04 , 2025 | 12:29 AM