Share News

యూరియా కోసం నిరీక్షణ

ABN , Publish Date - Jun 26 , 2025 | 11:39 PM

వర్షాలు కురిసి సాగు పనులు జోరం దుకున్న వేళ రైతులను యూరియా కొరత వేధిస్తోంది. అరకొర యూరియా సరఫరా అవుతుండటంతో బస్తాల కోసం రైతులు ఎదురు చూస్తున్నారు.

యూరియా కోసం నిరీక్షణ
యూరియా కోసం నెన్నెల ఎఫ్‌పీసీ వద్ద ఎగబడుతున్న రైతులు

నెన్నెల, జూన్‌ 26 (ఆంధ్రజ్యోతి) : వర్షాలు కురిసి సాగు పనులు జోరం దుకున్న వేళ రైతులను యూరియా కొరత వేధిస్తోంది. అరకొర యూరియా సరఫరా అవుతుండటంతో బస్తాల కోసం రైతులు ఎదురు చూస్తున్నారు. స హకార సంఘాలు, ప్రైవేటు డీలర్ల వద్ద స్టాక్‌ లేక పోవడంతో యూరియా కోసం నిరీక్షిస్తున్నారు. గురువారం నెన్నెల మహిళా రైతు ఉత్పత్తిదారుల కం పెనీ (ఎఫ్‌పీసీ)కి 260 బస్తాల యూరియా వచ్చింది. తెలుసుకున్న రైతులు బస్తాల కోసం ఎగబడ్డారు. ఆధార్‌, పట్టాదారు పాసు పుస్తకం నకలు తీసుకొ ని ఒక్కో రైతుకు మూడు బస్తాలు మాత్రమే ఇచ్చారు. బస్తాలు దొరకని వారు నిరాశగా వెనుదిరిగారు. మూడు బ్యాగులు ఏ మూలకు సరిపోతా యాని రైతులంటున్నారు. సరిపడా యూరియా సరఫరా చేయాలని కోరుతున్నారు.

Updated Date - Jun 26 , 2025 | 11:39 PM