పదవుల కోసం నిరీక్షణ
ABN , Publish Date - Jul 18 , 2025 | 11:54 PM
నామినేటెడ్ తో పాటు డీసీసీ పదవుల భర్తీపై కాంగ్రెస్ దృష్టి పెట్టింది. ఈ మేరకు పదవులు భర్తీ చేసేందుకు భారీ కసరత్తు చేస్తోంది. పదేళ్ల సుదీర్ఘ విరామం తర్వాత రా ష్ట్రంలో పదవుల నియామకం చేపట్టనుండటంతో కాం గ్రెస్ శ్రేణుల్లో ఉత్సాహాన్ని నింపుతోంది.
-నామినేటెడ్‌తో పాటు డీసీసీ పదవుల కోసం కాంగ్రెస్ కసరత్తు
-జిల్లా స్థాయిలోనూ పదవుల భర్తీకి సన్నాహాలు
-రాష్ట్ర స్థాయిలో కార్పొరేషన్లకూ అవకాశం
-ఎమ్మెల్యేల చేతుల్లోనే డీసీసీ పదవి
-కీలక పదవుల్లో నియామకాలపై టీపీపీసీ దృష్టి
మంచిర్యాల, జూలై 18 (ఆంధ్రజ్యోతి): నామినేటెడ్ తో పాటు డీసీసీ పదవుల భర్తీపై కాంగ్రెస్ దృష్టి పెట్టింది. ఈ మేరకు పదవులు భర్తీ చేసేందుకు భారీ కసరత్తు చేస్తోంది. పదేళ్ల సుదీర్ఘ విరామం తర్వాత రా ష్ట్రంలో పదవుల నియామకం చేపట్టనుండటంతో కాం గ్రెస్ శ్రేణుల్లో ఉత్సాహాన్ని నింపుతోంది. అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికల సమయంలో పదవులు ఆశించి భంగప డ్డ నేతలు, జిల్లా స్థాయిలో పార్టీ కోసం ఏళ్లతరబడి క ష్టపడ్డ కార్యకర్తలకు పార్టీ పదవుల్లో పెద్దపీట వేస్తా మని, త్వరలో నామినేటెడ్‌తో పాటు పార్టీ పదవుల కే టాయింపు ఉంటుందని అధిష్టానం ప్రకటించింది. దీం తో ఆ పార్టీ క్యాడర్‌లో ఆనందోత్సాహాలు నెలకొన్నాయి. దీంతో పదవులు ఆశిస్తున్న నాయకులు ఎమ్మెల్యేల ద్వా రా పార్టీ అధిష్టానానికి విజ్ఞప్తులు చేస్తున్నారు. ఇదిలా ఉండగా డీసీసీ పదవిని జిల్లాలోని శాసనసభ్యులకే ఇవ్వాలని పార్టీ సూత్రప్రాయంగా నిర్ణయించగా, ఇతర సీనియర్ నేతలకూ లభించే అవకాశాలు కూడా కని పిస్తున్నాయి. ఈ నేపథ్యంలో డీసీసీ పదవుల అంశం తీవ్ర చర్చనీయాంశం అవుతోంది. త్వరలో పదవులు భర్తీ చేసేందుకు అధిష్టానం ప్రయత్నిస్తుండగా ఎవరె వరికి ఏయే పదవులు లభిస్తాయన్నది ఉత్కంఠగా మారింది.
డీసీసీ పదవి వరించేదెవరినో...?
కాంగ్రెస్ జిల్లా అధ్యక్ష పదవిని ఎమ్మెల్యేలకి ఇవ్వా లని అధిష్టానం సూత్రపాయంగా నిర్ణయించినట్టుగా ప్రచారం జరుగుతోంది. అయితే డీసీసీ పదవిని చేప ట్టేందుకు ఎమ్మెల్యేలు ఆసక్తిగా లేరని తెలుస్తోంది. ఒక వేళ ఎమ్మెల్యేలు ఆసక్తి చూపని పక్షంలో సీనియర్ నేతలు, క్రియాశీలకంగా ఉన్న నేతల పేర్లను అధిష్టా నం పరిశీలిస్తుందనే ప్రచారం జరుగుతోంది. దీంతో జి ల్లా అధ్యక్ష పదవి హాట్ టాపిక్‌గా మారింది. ప్రస్తుతం జిల్లా కాంగ్రెస్ అధ్యక్షురాలిగా మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేంసాగర్‌రావు సతీమణి కొక్కిరాల సురేఖ బాధ్యతలు నిర్వహిస్తున్నారు. రెండు పర్యాయాలుగా ఆమె పదవిలో ఉండగా, జిల్లా క్యాడర్‌ను ఏకతాటిపై ఉంచా రన్న పేరు సురేఖకు ఉంది. పార్టీ క్యాడర్‌కు నిత్యం అందుబాటులో ఉంటారనే పేరు సైతం సురేఖకు ఉం ది. అయితే ప్రభుత్వ నిర్ణయం మేరకు మార్పులు జరి గే అవకాశాలు ఉంటాయన్న ప్రచారం కూడా జరుగు తోంది. ఒకవేళ డీసీసీ అధ్యక్షులుగా కొత్తవారిని నియ మిస్తే ఎవరికి ఆ పదవి వరిస్తుందోనన్న చర్చ జోరుగా సాగుతోంది. జిల్లాలోని మంచిర్యాల, చెన్నూరు, బెల్లం పల్లి అసెంబ్లీ నియోజక వర్గాల పరిధిలో సీనియర్ నా యకులు ఉండగా, వారంతా ప్రస్తుతం ఆయా నియో జక వర్గాల ఎమ్మెల్యేల కనుసన్నల్లో పయనిస్తున్నారు. దీంతో డీసీసీ పదవిని అలంకరించే స్థాయి గల వ్యక్తుల వివరాలను అధిష్టానం తెప్పించుకునే ప్రయత్నంలో ఉన్నట్లు సమాచారం. ప్రస్తుతం పదవిని అలంకరిస్తు న్న కొక్కిరాల సురేఖనే మరోమారు కొనసాగించవచ్చు ననే ప్రచారం కూడా జరుగుతోంది. మరోవైపు డీసీసీ అధ్యక్ష పదవిని ఆశిస్తున్న వారిలో చెన్నూరు నియోజక వర్గానికి చెందిన సీనియర్ నేత పురాణం సతీష్‌కుమా ర్ పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. ఆయన బీఆర్‌ఎస్ పార్టీలో ఉండగా 12 ఏళ్లు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా అధ్యక్షుడిగా పని చేశారు. అలాగే టీడీపీ హయాంలో తెలుగు యువత జిల్లా అధ్యక్షుడిగా ఆరేళ్ల పాటు బా ధ్యతలు నిర్వహించగా, టీఆర్‌ఎస్ పొలిట్ బ్యూరో స భ్యుడిగా, స్టేట్ సెక్రటరీగా పని చేశారు. అలాగే రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, పీసీసీ మెంబర్‌గా ఉన్న చెన్నూర్ ని యోజకవర్గంలోని రామకృష్ణాపూర్‌కు చెందిన సీనియర్ నేత పిన్నింటి రఘునాథ్‌రెడ్డి కూడా డీసీసీ అధ్యక్ష ప దవిని ఆశిస్తున్న వారిలో ఉన్నారు. ఆయన ఉమ్మడి ఆదిలాబాద్ యూత్ జిల్లా అధ్యక్షుడిగా ఏడు సంవత్స రాలు, ఎన్‌ఎస్‌యూఐ అధ్యక్షుడిగా ఐదేళ్లు, పీసీసీ కా ర్యదర్శిగా ఏడేళ్లు,, నాగర్ కర్నూల్ పార్లమెంట్ కో ఆర్డి నేటర్‌గా పని చేసిన అనుభవం రఘునాథ్‌రెడ్డికి ఉంది. అలాగే బెల్లంపల్లి నియోజకవర్గం నుంచి మరో సీని యర్ నేత, మాజీ జడ్పీటీసీ కారుకూరి రాంచందర్ కూ డా డీసీసీ పదవిని ఆశిస్తున్న వారిలో ఉన్నారు. డీసీసీ పదవి భర్తీ పీసీసీ చేతిలో ఉండగా, ఆది ఎవరిని వరి స్తుందోనన్న చర్చ సాగుతోంది.
భర్తీకానున్న నామినేటెడ్ పదవులు...
టీపీసీసీ తీసుకున్న నిర్ణయం మేరకు స్థానిక సంస్థల ఎన్నికల లోపే నామినేటెడ్ పదవులను భర్తీ చేయడం ద్వారా పార్టీని మరింత బలోపేతం చేయనున్నట్లు జో రుగా ప్రచారం జరుగుతోంది. స్థానిక ఎన్నికల లోపు అన్ని రకాల పదవులు భర్తీ చేస్తేనే గ్రామ స్థాయిలో పట్టు బిగిస్తుందనే ఆలోచనతో పీసీసీ వీలైనంత త్వర గా పోస్టుల నియామకం ప్రక్రియ పూర్తి చేసేందుకు సన్నాహాలు చేస్తోంది. జిల్లా స్థాయిలో గ్రామ కమిటీలు, మండల పార్టీ అధ్యక్షులు, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులతో పాటు డీసీసీ పదవులను భర్తీ చేయనున్నారు. అలాగే మార్కెట్ కమిటీలు (నియామకం జరగని చోట), గ్రం థాలయ చైర్మన్, వివిధ కార్పొరేషన్ చైర్మన్ల పదవులు భర్తీ కానున్నాయి.