బకాయిల కోసం ఎదురుచూపులు..
ABN , Publish Date - Jul 25 , 2025 | 12:22 AM
గుర్తింపు పొందిన ప్రైవేటు కళాశాలలను నడపలేక వాటి యజ మానులు చేతులెత్తేశారు. ఇంతకాలం ఏదో రకంగా లా క్కొచ్చినప్పటికీ.. ఇక మీదట ఆ పరిస్థితి కానరావడం లేదు. ప్రభుత్వాలు ఫీజు రీయంబర్స్‌మెంట్‌తో పాటు, ఉపకార వేతనాలు విడుదల చేయకపోవడమే దీనికి కారణంగా నిలుస్తోంది.
-బోధనా రుసుం చెల్లించకపోవడంతో ప్రైవేటు కళాశాలలపై ఆర్థిక భారం
-అప్పుల్లో కూరుకుపోతున్న యాజమాన్యాలు
-మూడేళ్లుగా విడుదలగాని నిధులు
-జిల్లాలో కోట్లాది రూపాయలు పెండింగ్
మంచిర్యాల, జూలై 24 (ఆంధ్రజ్యోతి): గుర్తింపు పొందిన ప్రైవేటు కళాశాలలను నడపలేక వాటి యజ మానులు చేతులెత్తేశారు. ఇంతకాలం ఏదో రకంగా లా క్కొచ్చినప్పటికీ.. ఇక మీదట ఆ పరిస్థితి కానరావడం లేదు. ప్రభుత్వాలు ఫీజు రీయంబర్స్‌మెంట్‌తో పాటు, ఉపకార వేతనాలు విడుదల చేయకపోవడమే దీనికి కారణంగా నిలుస్తోంది. ప్రభుత్వం అందజేసే ఫీజు రీ యింబర్స్ మెంట్‌పైనే ఆధారపడి ప్రైవేటు కాలేజీల యాజమాన్యాలు అర్హతగల విద్యార్థులకు ఉచిత విద్యా బోధన అందిస్తున్నాయి. ఇందుకుగాను బోధనకు అ య్యే ఖర్చులన్నీ యాజమాన్యాలు అప్పో, సప్పో చేసి భరిస్తున్నాయి. ప్రభుత్వం ఫీజు రీయింబర్స్ మెంట్ వి డుదల చేస్తే తాము చేసిన అప్పులతోపాటు తమ ఖ ర్చులకూ ఇబ్బందులు ఉండవని భావిస్తూ ఏళ్ల తరబడి వేచి చూస్తున్నాయి. మూడేళ్లుగా ప్రభుత్వాలు ఫీజు రీ యింబర్స్‌మెంట్, ఉపకార వేతనాలను విడుదల చేయక పోవడం, కళాశాలల నిర్వహణ తలకు మించిన భా రం కావడంతో కళాశాలల మనుగడ కష్టసాధ్యంగా మారింది.
రూ. 30 కోట్ల మేర బకాయిలు....
జిల్లాలో 2021-22 నుంచి 2024-25 వరకు మూడు సంవత్సరాల్లో ఇంటర్మీడియట్, డిగ్రీ, పీజీ విద్యార్థులు మొత్తం 20 వేల వరకు ఉండగా, ఫీజు రీయింబర్స్ మెంట్, ఉపకార వేతనాలు కలిపి రూ. 30 కోట్ల వరకు బకాయిలు పేరుకుపోయాయి. బీసీ సంక్షేమ శాఖలో ఎంటీఎఫ్ (స్టూడెంట్ మెయింటనెన్స్) రూ. 3.50 కోట్ల బకాయిలు ఉండగా, ఆర్టీఎఫ్ (ఫీజు రీయింబర్స్ మెం ట్) రూ. 20.50 కోట్లు పెండింగులో ఉన్నాయి. ఈ బకా యిలు ఇలా ఉండగానే కొత్తగా చేరుతున్న విద్యార్థులు మళ్లీ దరఖాస్తు చేసుకుంటున్నారు. అలాగే ఈబీసీ డి పార్టుమెంట్ ఆర్టీఎఫ్ రూ. 2.50 కోట్లు బకాయిలు ఉం డగా, మైనారిటీ కేటగిరీ కింద ఎంటీఎఫ్ రూ. 1.30 కో ట్లు, ఆర్టీఎఫ్ రూ. 3.90 కోట్ల బకాయిలు ఉన్నాయి. ఎస్సీ సంక్షేమ శాఖలో ఎంటీఎఫ్ రూ. 2.20 కోట్లు ఉం డగా, ఆర్టీఎఫ్ రనూ. 3.70 కోట్ల బకాయిలు ఉన్నాయి. అలాగే ఎస్టీ సంక్షేమ శాఖ ద్వారా 5.85 కోట్ల రూపాయ లు బకాయిలు ఉన్నాయి. మొత్తం బకాయిల్లో దాదాపు రూ. 15 కోట్లకు ప్రొసీడింగ్స్‌తోపాటు 10 నెలల క్రితం టోకెన్ నెంబర్లు ఇచ్చినప్పటికీ ట్రెజరీల్లో పెండింగులో ఉన్నట్లు చూపిస్తుండటం గమనార్హం. అవి విద్యార్థుల ఖాతాల్లో జమ కాకపోవడంతో పరిస్థితి ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా తయారైంది. 2021-22 ఆర్థిక సంవత్సరంలో 22 శాతం పెండింగులో ఉండగా, 2022-23లో 30 శాతం, 2023-24లో 60 శాతం, 2024 -25లో వంద శాతం బకాయిలు ఉన్నాయి.
కంటి తుడుపు చర్యగా నిధులు విడుదల...
గత బీఆర్‌ఎస్ హయాం నుంచే మొదలైన రీయింబ ర్స్‌మెంట్ బకాయిలు కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలోనూ విడుదల కావడం లేదు. దీంతో అధ్యాపకుల వేతనాలు చెల్లించి, కళాశాలలు నడిపించడం కష్టంగా మారిందని పైవ్రేట్ యాజమాన్యాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నా యి. బస్సులు నడపాల్సి రావడంతో నిత్యం మెయింట నెన్స్ కింద ఖర్చులు వేలల్లో భరించాల్సి వస్తుందని ఆ వేదన చెందుతున్నాయి. ఇదిలా ఉండగా మొన్నటి ఎ మ్మెల్సీ ఎన్నికల..
సమయంలో కాంగ్రెస్ సర్కారు కంటి తుడుపు చర్యగా కొంత మొత్తం రీయంబర్స్ మెంట్ బ కాయిలు విడుదల చేసింది. ఎమ్మెల్సీ ఎన్నికల సమ యంలో ఉమ్మడి నిజామాబాద్, కరీంనగర్, ఆదిలాబాద్ జిల్లాలకు 2023-24 విద్యా సంవత్సరానికి సంబంఽధించి బకాయిల్లో 30 శాతం మేర ప్రభుత్వం విడుదల చేసిం ది. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు కావడంతో ఓట్లు రాబట్టేందుకే ఆ మొత్తం విడుదల చేసిందనే అభిప్రా యాలు వ్యక్తమవుతున్నాయి.
మూసివేతకు గురవుతున్న కళాశాలలు....
జిల్లాలో ఒకప్పుడు 14 డిగ్రీ, 14 జూనియర్ కళాశా లు ఉంటే... ప్రస్తుతం 5 చొప్పున మిగిలాయి. నిర్వహణ భారమై ప్రతియేటా కళాశాలలు మూసివేతకు గు రవుతున్నాయి. దీనికి కారణం ఫీజు రీయింబర్స్ మెంట్, ఉపకార వేతనాలు విడుదల చేయకపోవడమే. ప్రభు త్వ కళాశాల్లో డేటా సైన్స్, ఫుడ్ సైన్స్, డైరీ సైన్స్, బీబీఏ తదితర కోర్సులు అందుబాటులో లేవు. ప్రైవేటులో మా త్రమే ఉన్నాయి. విద్యార్థులు కళాశాలకు రావాలంటే బ స్సులు నడపక తప్పని పరిస్థితులు నెలకొన్నాయి. దీం తో నిర్వహణ ఖర్చులు విపరీతంగా పెరిగిపోయాయి. నిర్వహణ భారంతో కళాశాలలు ఎత్తివేస్తుండటంతో వి ద్యార్థులు ఆ విభాగాల్లోని విద్యకు దూరమవుతున్నా రు. ఇదే పరిస్థితి కొనసాగితే ఒక్కొక్కటిగా కళాశాలలు మూసివేతకు గురై విద్యార్థులు ఉన్నత విద్య కోసం ఇతర ప్రాంతాలకు వలస వెళ్లాల్సిన పరిస్థితులు నెల కొనే అవకాశాలు ఉన్నాయి. ఇదిలా ఉండగా, జిల్లా కేం ద్రంలో ఓ జూనియర్ కళాశాలను యాజమాన్యం ఇటీ వల మూసివేసింది. కళాశాల నిర్వహణకు అప్పులు చే యాల్సి రావడం, ఫీజు రీయంబర్స్‌మెంట్ నిధులు రా కపోవడంతో రాత్రికి రాత్రే కళాశాలను మూసి, ఎవరికీ కనిపించకుండా పోయాడు. దీంతో ఆయనకు అప్పులు ఇచ్చిన వారి తోపాటు ఆ కళాశాలలో చదివిన విద్యార్థు లూ నానా ఇబ్బందులు పడాల్సి వస్తోంది.
ప్రభుత్వం స్పందించాలి...
నర్సయ్య, తెలంగాణ ప్రైవేటు డిగ్రీ మేనేజ్‌మెంట్ అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్
పభుత్వం ఫీజు రీయింబర్స్ మెంట్, ఉపకార వేతనా లు విడుదల విషయంలో ప్రభుత్వం తక్షణమే స్పందిం చాల్సిన అవసరం ఉంది. ఫీజు రీయింబర్స్‌మెంట్, ఉప కార వేతనాలు విడుదల చేయడం ద్వారా కళాశాలల ను కాపాడాలి. కళాశాలలు మూసివేతకు గురైతే పేద, మధ్యతరగతి విద్యార్థులు నష్టపోవడంతోపాటు వాటిలో వివిధ విభాగాల్లో పని చేస్తున్న వారంతా ఉపాధిని కోల్పోయే ప్రమాదం ఉంది.