పోటెత్తిన ఓటర్లు..
ABN , Publish Date - Dec 15 , 2025 | 12:32 AM
రెండో విడుత గ్రామ పంచాయతీ ఎన్నికలు ఆదివారం ప్ర శాంతంగా ముగిశాయి. ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు బ్యాలెట్ పద్ధతిలో పోలింగ్ ప్రక్రియ కొనసాగింది. రెండో విడుత ఓట్ల లెక్కింపు మధ్యాహ్నం 2 గంటల నుంచి ప్రారంభం కాగా రాత్రి వరకు కొనసాగింది. అత్యధిక స్థానాల్లో అధికార కాంగ్రెస్ పార్టీ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థు లు గెలుపొందారు.
రెండో విడత ఎన్నికలు ప్రశాంతం....
-బెల్లంపల్లి నియోజక వర్గంలోని ఏడు మండలాల్లో పోలింగ్
-111 సర్పంచ్, 873 వార్డు సభ్యుల స్థానాలకు పోటీ
-ఓటు హక్కును వినియోగించుకున్న 1.16 లక్షల మంది
-మొత్తంగా 84.59 శాతం పోలింగ్ నమోదు
మంచిర్యాల, డిసెంబరు 14 (ఆంధ్రజ్యోతి): రెండో విడుత గ్రామ పంచాయతీ ఎన్నికలు ఆదివారం ప్ర శాంతంగా ముగిశాయి. ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు బ్యాలెట్ పద్ధతిలో పోలింగ్ ప్రక్రియ కొనసాగింది. రెండో విడుత ఓట్ల లెక్కింపు మధ్యాహ్నం 2 గంటల నుంచి ప్రారంభం కాగా రాత్రి వరకు కొనసాగింది. అత్యధిక స్థానాల్లో అధికార కాంగ్రెస్ పార్టీ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థు లు గెలుపొందారు. పంచాయతీ ఎన్నికల్లో వివిధ సా మాజిక వర్గాల వారీగా 50 శాతం మించకుండా రిజ ర్వేషన్లు కల్పించారు. పంచాయతీ ఎన్నికల్లో భాగంగా జిల్లాలోని మొత్తం 306 గ్రామ పంచాయతీల్లో సర్పం చ్ స్థానాల్లో బీసీలకు 23, ఎస్సీలకు 117, ఎస్టీలకు 29, జనరల్‌కు 137 స్థానాలను కేటాయించారు. అలాగే వార్డు సభ్యుల్లో స్థానాల్లో ఎస్సీలకు 803, ఎస్టీలకు 253, బీసీలకు 334, జనరల్ కేటగరీకి 1290 స్థానా లను రిజర్వ్ చేశారు.
111 సర్పంచ్, 873 వార్డు సభ్యుల స్థానాలు...
రెండో విడత పంచాయతీ ఎన్నికలు బెల్లంపల్లి అ సెంబ్లీ నియోజక వర్గ పరిధిలోని ఏడు మండలాల్లో జ రిగాయి. నియోజకవర్గంలోని బెల్లంపల్లి, భీమిని, కన్నె పల్లి, కాసిపేట, నెన్నెల, తాండూరు, వేమనపల్లి మండ లాల్లో పంచాయతీ ఎన్నికలు నిర్వహించగా ఆయా మండలాల పరిధిలో మొత్తం 114 సర్పంచ్ స్థానాలు, 996 వార్డు సభ్యుల స్థానాలను అధికారులు గుర్తిం చారు. వాటిలో బెల్లంపల్లి మండలంలో 17 గ్రామ పం చాయతీ (జీపీ)లు ఉండగా, భీమిని మండలంలో 12 జీపీలు, కన్నెపల్లి మండలంలో 15 జీపీలు, కాసిపేట మండలంలో 22 జీపీలు, నెన్నెల మండలంలో 19 జీపీ లు, తాండూరు మండలంలో 15 జీపీలు, వేమనపల్లి మండలంలో 13 జీపీలు ఉన్నాయి. ఏడు మండలా ల్లోని సర్పంచ్ స్థానాలు 114కు గాను కన్నెపల్లి మం డలం ముత్తాపూర్, కాసిపేట వండలంలో ధర్మరా వుపేట గ్రామాలు ఏకగ్రీవం అయ్యాయి. వేమనపల్లి మండలం రాజారం గ్రామంలో సర్పంచ్ స్థానం షె డ్యూల్డ్ ట్రైబ్స్ (ఎస్టీ)కు రిజర్వ్ కావలసి ఉండగా, అందుకు భిన్నంగా షెడ్యూల్డ్ క్యాస్ట్ (ఎస్సీ) సామాజిక వర్గానికి రిజర్వేషన్ అవకాశం కల్పించారు. రిజర్వేషన్ అనుకూలించకపోవడం, గ్రామంలో ఒక్క ఎస్సీ ఓటరు కూడా లేకపోవడంతో రాజారంలో నామినేషన్లు దాఖ లు కాలేదు. దీంతో గ్రామంలో సర్పంచ్ ఎన్నిక నిలి చిపోయింది. ఇక మిగిలిన 111 సర్పంచ్ స్థానాలకు ఎన్నికలు జరగాల్సి ఉండగా, మొత్తం 574 మంది తమ నామినేషన్లు దాఖలు చేశారు. వారిలో 238 రెం డు తమ నామినేషన్లను నిర్ణీత గడువులోగా ఉప సంహరించుకోగా, మిగిలిన 334 మంది ఎన్నికల బరిలో నిలిచారు.
అలాగే ఏడు మండలాల్లోని 114 గ్రామాల్లో గుర్తిం చిన మొత్తం వార్డు సభ్యుల స్థానాలు 996కుగాను మొత్తం 2291 మంది తమ నామినేషన్లు దాఖలు చే శారు. వారిలో గడువు ముగిసే నాటికి 232 మంది అ భ్యర్థులు తమ నామినేషన్లను ఉపసంహరించు కున్నా రు. మిగిలిన 873 వార్డు సభ్యుల స్థానాలకు ఎన్నికలు నిర్వహించాల్సి ఉండగా, మొత్తం 2059 మంది బరిలో నిలిచారు. అలా రెండో విడుతలో మొత్తం మూడు పంచాయతీల్లో ఎన్నికలు జరుగకపోగా, మిగిలిన 111 జీపీల్లో సర్పంచ్, 873 వార్డు సభ్యుల స్థానాలకు ఎన్ని కలు ప్రశాంతంగా జరిగాయి.
84.59 శాతం పోలింగ్ నమోదు...
రెండో విడుతలో ఎన్నికలు జరిగిన బెల్లంపల్లి ని యోజక వర్గంలోని ఏడు మండలాల్లో మధ్యాహ్నం ఒంటి గంట వరకు పోలింగ్ ముగిసే సమయానికి మొత్తం 84.59 శాతం పోలింగ్ నమోదైంది. ఏడు మండలాల పరిధిలో మొత్తం 1,37,382 మంది ఓటర్లు ఉండగా 1,16,205 మంది తమ ఓటు హక్కును విని యోగించుకున్నారు. ఓటు హక్కును వినియోగించు కున్న వారిలో పురుషులు 58,179 మంది ఉండగా, స్త్రీలు 58,023 మంది, ఇతరులు ముగ్గురు ఓటర్లు ఉన్నారు. ప్రారంభంలో కొంచెం మందకొడిగా సాగిన పోలింగ్ ప్రక్రియ అనంతరం ఊపందుకుంది. ఓట్లు వేసేందుకు గ్రామస్థులు తరలివచ్చారు. ఉదయం 9 గంటల వరకు21.52 శాతం నమోదైన పోలింగ్, 11 గంటల వరకు 56.44 శాతానికి చేరింది. అలాగే స మయం ముగిసే సరికి మధ్యాహ్నం ఒంటి గంట వర కు 79.2 శాతం పోలింగ్ నమోదైంది. అప్పటి వరకు క్యూ లైన్‌లలో ఉన్న వారిని ఓటు వేసేందుకు అధికా రులు అనుమతించారు. దీంతో పోలింగ్ శాతం 84.59కి చేరుకుంది.
మండలాల వారీగా నమోదైన పోలింగ్...
బెల్లంపల్లి నియోజక వర్గంలోని ఏడు మండలాల్లో ఎన్నికలు జరిగాయి. వాటిలో అత్యధికంగా కన్నెపల్లి మండలంలో 90.37 శాతం పోలింగ్ నమోదుకాగా, అ త్యల్పంగా తాండూరు మండలంలో 78.52 శాతం పో లింగ్ నమోదైంది. బెల్లంపల్లి మండలంలో 85.30 శా తం, భీమిని మండలంలో 89.90 శాతం, కాసిపేట మండలంలో 78.74 శాతం, నెన్నెల మండలంలో 89.08 శాతం, వేమనపల్లి మండలంలో 89 శాతం పోలింగ్ నమోదైంది.