Share News

ఓట్ల చోరీ ప్రజాస్వామ్యానికి ప్రమాదకరం

ABN , Publish Date - Oct 14 , 2025 | 11:11 PM

ఓట్ల చోరీ ప్రజా స్వామ్యానికి ప్రమాదకరమని క ల్వకుర్తి మాజీ సర్పంచ్‌ బృంగి ఆనంద్‌కుమార్‌ అన్నారు.

ఓట్ల చోరీ ప్రజాస్వామ్యానికి ప్రమాదకరం
కల్వకుర్తిలో ఓటు చోరీకి వ్యతిరేకంగా సంతకాలు సేకరిస్తున్న కాంగ్రెస్‌ నాయకులు

- కల్వకుర్తి మాజీ సర్పంచ్‌ బృంగి ఆనంద్‌కుమార్‌

కల్వకుర్తి, అక్టోబరు 14 (ఆంధ్రజ్యోతి) : ఓట్ల చోరీ ప్రజా స్వామ్యానికి ప్రమాదకరమని క ల్వకుర్తి మాజీ సర్పంచ్‌ బృంగి ఆనంద్‌కుమార్‌ అన్నారు. ఓటు చోరీకి వ్యతిరేకంగా ప్రతీ గ్రామం లో వంద మందితో సంతకాల సే కరణ చేపట్టాలని ఏఐసీసీ ఆదేశా లతో మంగళవారం కల్వకుర్తిలో సంతకాల సేకరణ నిర్వహించారు. ఎమ్మెల్యే కశి రెడ్డి నారాయణరెడ్డి ఆదేశాలతో కల్వకుర్తి పట్ట ణంతో పాటు మండలంలోని మార్చాల గ్రామం లో సంతకాల సేకరణ చేపట్టారు. ఆయన మా ట్లాడుతూ దేశంలో ప్రతీ చోట బీజేపీ ఓటు చో రీకి పాల్పడిందని అన్నారు. కార్యక్రమంలో కల్వ కుర్తి బ్లాక్‌ కాంగ్రెస్‌ అధ్యక్షుడు కాయితీ విజయ్‌ కుమార్‌రెడ్డి, కాంగ్రెస్‌ పార్టీ పట్టణ ప్రెసిడెంట్‌ శ్రీకాంత్‌రెడ్డి, శేశిరెడ్డి, నాయకులు పాల్గొన్నారు.

ఫ చారకొండ, (ఆంధ్రజ్యోతి) : అచ్చంపేట ఎమ్మెల్యే డాక్టర్‌ వంశీకృష్ణ ఆదేశాల మేరకు కాంగ్రెస్‌ పార్టీ మండల అధ్యక్షుడు జమ్మికింది బాల్‌రాంగౌడ్‌ ఆధ్వర్యంలో మండల కేంద్రంలో కాంగ్రెస్‌ పార్టీ నాయకులు ఓటు చోరీకి వ్యతిరేకంగా సంతకాల సేకరణ చేపట్టారు. కార్యక్రమంలో మండల ప్రసిడెంట్‌ అంజయ్య, ఆర్మీ రిటైర్డ్‌ ఆరేళ్ల యాదయ్యగౌడ్‌, లక్ష్మణ్‌, సత్తార్‌, రామకృష్ణగౌడ్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Oct 14 , 2025 | 11:11 PM