kumaram bheem asifabad- పాఠశాలను సందర్శించి.. పాఠాలు బోధించి..
ABN , Publish Date - Aug 30 , 2025 | 10:55 PM
మండల కేంద్రంలోని మండల పరిషత్ పాఠశాలను అదనపు కలెక్టర్ దీపక్ తివారి శనివారం సందర్శించి విద్యార్థులకు గణితం బోధించారు. ఈ సందర్భంగా విద్యార్థుల సామర్థ్యాలను పరీక్షించి పలు అంశాలను వివరించారు. అలాగే మధ్యాహ్న భోజన నాణ్యత, తరగతి గదులు, భోజన శాల పరిసరాల పరిశుభ్రత, రిజిస్టర్లను పరి శీలించారు.
పెంచికలపేట, ఆగస్టు 30 (ఆంధ్రజ్యోతి): మండల కేంద్రంలోని మండల పరిషత్ పాఠశాలను అదనపు కలెక్టర్ దీపక్ తివారి శనివారం సందర్శించి విద్యార్థులకు గణితం బోధించారు. ఈ సందర్భంగా విద్యార్థుల సామర్థ్యాలను పరీక్షించి పలు అంశాలను వివరించారు. అలాగే మధ్యాహ్న భోజన నాణ్యత, తరగతి గదులు, భోజన శాల పరిసరాల పరిశుభ్రత, రిజిస్టర్లను పరి శీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు సకల సదుపాయాలతో కూడిన నాణ్యమైన విద్య అందుతుందన్నారు. ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు తాగునీరు, విద్యుత్, మూత్రశాలలు, అదనపు గదులు, ప్రహారి గోడ సదుపాయాలు కల్పించడంతో పాటు మధ్యాహ్న భోజనంలో పోషక విలువలతో కూడిన మెనూ అమలు చేస్తుందని తెలిపారు. విద్యార్థులకు అందించే విద్యాబోధన, మధ్యాహ్న భోజనం నాణ్యత విషయంలో రాజీ పడకూడదని అధికారులకు సూచించారు. మద్యాహ్న భోజన తయారీలో తాజా కూరగాయలు, నాణ్యమైన నిత్యావసర సరుకులు వినియోగించాలని చెప్పారు. వంట సమయంలో శుభ్రత పాటించాలని, విద్యార్థులకు శుద్ధమైన తాగనీరు అందించాలని సూచించారు. కార్యక్రమంలో ఎంపీడీవో ఆల్బర్ట్, ఆయా శాఖల సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
విద్యార్థులకు మెరుగైన విద్య అందించాలి
దహెగాం, ఆగస్టు 30 (ఆంధ్రజ్యోతి): విద్యార్థులకు మెరుగైన విద్య అందించాలని అదనపు కలెక్టర్ దీపక్ తివారి అన్నారు. మండల కేంద్రంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలను శనివారం అదనపు కలెక్టర్ తనిఖీ చేశారు. పాఠశాలకు సంబంధించిన పలు రికార్డులను పరిశీలించారు. పదో తరగతి విద్యార్థుల గణిత బోధనపై పలు ప్రశ్నలు అడిగి సమాధానాలు రాబట్టారు. తరగతి గదిలో బోర్డుపై విద్యార్థుల చేత గణితానికి సంబంధించిన ప్రశ్న రాసి సమాధాన్ని రాబట్టారు. విద్యార్థులు కష్ట పడి చదివితేనే ఉజ్వల భవిష్యత్ ఉంటుందన్నారు. అదే విధంగా సెల్‌పోన్‌లో ఉపాధ్యాయులు, విద్యార్థుల ముఖ గుర్తింపు హాజరును పరిశీలించారు. మధ్యాహ్న భోజనంలో మెనూ పాటిస్తున్నారా అని ప్రశ్నించారు. ఆయన వెంట సెక్టోరల్ అధికారి శ్రీనివాస్, ఎంఈవో శ్రీనివాస్, ఎంపీడీవో రాజేందర్, ప్రధానోపాధ్యాయుడు కిషన్‌రావు తదితరులు ఉన్నారు.