kumaram bheem asifabad- పాఠశాలను సందర్శించి.. విద్యార్థులతో కలిసి పాఠాలు విని..
ABN , Publish Date - Aug 12 , 2025 | 10:50 PM
మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ పాఠశాలను మంగళవారం అదనపు కలెక్టర్ దీపక్ తివారి పరిశీలించారు. ఈ సందర్భంగా పదో తరగతి గదిలో గణిత ఉపాధ్యాయుడిన త్రికోణసమితి బోధించాలని ఆదేశించారు. దీంతో ఉపాధ్యాయుడు బోధిస్తున్న తీరును విద్యార్థులతో కలిసి కూర్చోని పాఠాలు విన్నారు. అనంతరం విద్యార్థులను ప్రశ్నలు అడిగి వారి నుంచి సమాధానాలు రాబాట్టారు.
కెరమెరి, ఆగస్టు 12 (ఆంధ్రజ్యోతి): మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ పాఠశాలను మంగళవారం అదనపు కలెక్టర్ దీపక్ తివారి పరిశీలించారు. ఈ సందర్భంగా పదో తరగతి గదిలో గణిత ఉపాధ్యాయుడిన త్రికోణసమితి బోధించాలని ఆదేశించారు. దీంతో ఉపాధ్యాయుడు బోధిస్తున్న తీరును విద్యార్థులతో కలిసి కూర్చోని పాఠాలు విన్నారు. అనంతరం విద్యార్థులను ప్రశ్నలు అడిగి వారి నుంచి సమాధానాలు రాబాట్టారు. అనంతరం పాఠశాలలో మధ్యాహ్న భోజనంను పరిశీలించారు. ఈ సందర్భంగా విద్యార్థులు గదులు పరిపోవడం లేదని, వంట గదిని నిర్మించాలని ఎంఈవో ప్రకాష్ అదనపు కలెక్టర్ దృష్టికి తీసుకు వచ్చారు. అనంతరం మండల కేంద్రంలోని ఇందిరమ్మ ఇళ్ల పనులను పరిశీలించారు. నాణ్యతగా నిర్మించాలని ఆదేశించారు. అనంతరం ఎంపీడీవో కార్యాలయంలో అన్ని పాఠశాలల ఉపాధ్యాయులు, కార్యదర్శులతో సమావేశం నిర్వహించారు. ఆయన వెంట ఎంపీడీవో అంజద్‌పాషా, ఎంఈవో ప్రకాష్, ప్రత్యేకాధికారి వెంకట్, కార్యదర్శులు సతీష్, గణేశ్ తదితరులు ఉన్నారు.