kumaram bheem asifabad- శిల్పకళ, వాస్తుశిల్పి మూలపురుషుడు విశ్వకర్మ
ABN , Publish Date - Sep 17 , 2025 | 11:18 PM
శిల్పకళ, వాస్తుశిల్పి మూలపురుషుడు విశ్వకర్మ అని శాసనమండలి డిప్యూటీ చైర్మన్ బండ ప్రకాష్ అన్నారు. కలెక్టరేట్‌లో బుధవారం విశ్వకర్మ జయంతి వేడుకలకు కలెక్టర్ వెంకటేష్ దోత్రే, ఎస్పీ కాంతిలాల్ పాటిల్, ఎమ్మెల్యే కోవ లక్ష్మి, అదనపు కలెక్టర్లు దీపక్ తివారి, డేవిడ్‌లతో కలిసి ముఖ్య అతిఽథిగా హాజరయ్యారు.
ఆసిఫాబాద్‌రూరల్, సెప్టెంబరు 17 (ఆంధ్రజ్యోతి): శిల్పకళ, వాస్తుశిల్పి మూలపురుషుడు విశ్వకర్మ అని శాసనమండలి డిప్యూటీ చైర్మన్ బండ ప్రకాష్ అన్నారు. కలెక్టరేట్‌లో బుధవారం విశ్వకర్మ జయంతి వేడుకలకు కలెక్టర్ వెంకటేష్ దోత్రే, ఎస్పీ కాంతిలాల్ పాటిల్, ఎమ్మెల్యే కోవ లక్ష్మి, అదనపు కలెక్టర్లు దీపక్ తివారి, డేవిడ్‌లతో కలిసి ముఖ్య అతిఽథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నేటి శిల్పులకు విశ్వకర్మ ఆదర్భ ప్రాయుడన్నారు. అర్కిటెక్చర్ అభివృద్ధి చెందని సమయంలో గొప్ప నైపుణ్యంతో ఎన్నో రాజ భవనాలను నిర్మించిన గొప్ప నైపుణ్యకారుడని కొనియాడారు. ఇంజనీరింగ్ విద్యార్థులకే కాకుండా చేతి వృత్తి కళాకారులు కూడ ఈయనను అనుసరించాలని సూచించారు. కార్యక్రమంలో జిల్లా బీసీ సంక్షేమాధికారి సజీవన్, ఏఎస్పీ చిత్తరంజన్, సబ్‌కలెక్టర్ శ్రద్ధ శుక్లా, పీఏసీఎస్ చై ర్మన్ ఆలీబీన్ ఆహ్మద్, విశ్వబ్రాహ్మణ సంఘం నాయకులు భాస్కరాచారి, అశోక్, సురే ష్‌చారి, వేణుగోపాల్, రాధాకృష్ణచారి, వెంకన్న, సంతోష్, సంతోష్ పాల్గొన్నారు.
ఆసిఫాబాద్‌రూరల్, సెప్టెంబరు 17(ఆంధ్రజ్యోతి): విశ్వకర్మ జయంతిని బుధవారం విశ్వబ్రాహ్మణ సంఘం ఆధ్వర్యంలో ఘనంగా జరుపుకున్నారు. పట్టణంలోని శ్రీ పోతు లూరి వీరబ్రహ్మేంద్రస్వామి ఆలయంలో ఉదయం ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం విశ్వకర్మ చిత్రపటంతో పట్టణంలోని ప్రధాన విదుల గుండా శోభాయాత్ర చేపట్టారు. అనంతరం అలయ ప్రాంగణంలో అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమంలో ఆలయ కమిటీ, విశ్వబ్రహ్మణ సంఘం నాయకులు శ్రీరాములు, వరప్రసాద్, తిరుపతిచారి, సురేష్‌చారి, వెంకటయ్య, భాస్కరచారి, అశోక్, వేణుగోపాల్, భట్టుపల్లి సంతోష్, వెంకన్న, నిఖిల్, మొండి, సంతోష్, రాజు, పెంటయ్య పాల్గొన్నారు.
కెరమెరి, (ఆంధ్రజ్యోతి): మండల కేంద్రంలో విశ్వకర్మ జయంతి వేడుకల సందర్భంగా శివాలయంలో విశ్వబ్రాహ్మణ సంఘం నాయకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. కార్యక్రమంలో సురేష్‌చారి, సంజీవ్‌చారి తదితరులు పాల్గొన్నారు.
బెజ్జూరు, (ఆంధ్రజ్యోతి): మండల కేంద్రంలోని వీరబ్రహ్మేంద్రస్వామి ఆలయంలో విశ్వబ్రాహ్మణ సంఘం ఆద్వర్యంలో విశ్వకర్మ జయంతిని ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్బంగా విశ్వకర్మ విగ్రహానికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అంతకు ముందు విశ్వకర్మ జెండాను ఆవిష్కరించారు. అనంతరం నిమజ్జనం చేశారు. పూజా కార్యక్రమాల్లో తహసీల్దార్ రామ్మోహన్, ఎంపీడీవో ప్రవీణ్‌కుమార్, ఎస్సై సర్తాజ్‌పాషా, విశ్వబ్రాహ్మణ సంఘం అద్యక్షుడు ఏలేశ్వరం పురుషోత్తమచారి, రంగనాయక ఆలయ కమిటీ అధ్యక్షుడు తంగడిపల్లి మహేష్, బ్లాక్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాచకొండ శ్రీవర్దన్, సంఘం నాయకులు చాకటి బ్రహ్మయ్య, ఏలేశ్వరం ప్రభాకర్, వెంకటయ్య, శ్రీరామ మోహన్, శ్రీకాంత్, షణ్ముఖ, కమలాకర్ తదితరులు పాల్గొన్నారు.