Share News

ఎన్నికల నియమావళి ఉల్లంఘిస్తే తీవ్ర పరిణామాలు

ABN , Publish Date - Dec 05 , 2025 | 12:07 AM

ఎన్నికల నియ మావళిని విస్మరించి అధికారులు తీవ్ర పరిణామాలను ఎదుర్కోక తప్ప దని మంచిర్యాల మాజీ ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్‌రావు పేర్కొన్నారు. గురువారం జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు.

ఎన్నికల నియమావళి ఉల్లంఘిస్తే తీవ్ర పరిణామాలు

మంచిర్యాల కలెక్టరేట్‌, డిసెంబరు 4 (ఆంధ్రజ్యోతి) : ఎన్నికల నియ మావళిని విస్మరించి అధికారులు తీవ్ర పరిణామాలను ఎదుర్కోక తప్ప దని మంచిర్యాల మాజీ ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్‌రావు పేర్కొన్నారు. గురువారం జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. దండేపల్లి మండలం పాత మామిడిపల్లి గ్రామంలో బీ ఆ ర్‌ఎస్‌ అభ్యర్థి మాధవిని కాంగ్రెస్‌ నాయకుల అండదండలతో ఒత్తిడి చేసి నామినేషన్‌ విత్‌డ్రా చేసుకునేలా చేయడం అమానుషమన్నారు. ఎన్నికల్లో అనుసరించాల్సిన నియమ నిబంధనలను తుంగలో తొక్కి ఎన్నికల కోడ్‌ను సైతం విస్మరించిన స్థానిక ఎస్‌ఐని, రిటర్నింగ్‌ అధికా రులను వెంటనే విధుల నుంచి తొలగించి వారిపై కఠిన చర్యలు తీసు కోవాలని డిమాండ్‌ చేశారు. న్యాయస్ధానాలపై తమకు పూర్తి విశ్వాసం ఉందని, ఈ అంశంపై హైకోర్టుకు వెళ్లి న్యాయం జరిగేలా చూస్తామ న్నారు. తమ ప్రభుత్వ హయాంలో పూర్తి పారదర్శకంగా ఎన్నికలు ని ర్వహించినప్పటికీ ఏ ఒక్క చోట అపశృతులు దొర్లిన దాఖలాలు లేవ న్నారు. బీఆర్‌ఎస్‌ అభ్యర్ధి మాధవి ఉపసంహరణ చేసుకునే సమయం దాటిపోయినప్పటికీ కూడా ఆమెను విత్‌డ్రా చేయించడానికి స్థానిక పో లీసులు భయబ్రాంతులకు గురి చేసి కేసులు నమోదు చేస్తామని మ ర్యాద పూర్వకంగా విత్‌ డ్రా చేసుకోవాలని చెప్పడం గర్హనీయమన్నా రు. ఈ విషయంపై కలెక్టర్‌కు సాయంత్రం అడగగా కలెక్టర్‌ కూడా స్పందించకపోవడం విస్మయానికి గురి చేసిందన్నారు. రాత్రి 9 గంటల ప్రాంతంలో కలెక్టర్‌, రిటర్నింగ్‌, ఇతర అధికారులు కాంగ్రెస్‌ అభ్యర్ధి వైష్ణ విని ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ప్రకటించడాన్ని ఖండిస్తున్నామన్నారు. ఎన్నికల కోడ్‌, నియమాలు పాటించని ఎన్నికల అధికారులు, ఎస్‌ఐపై న్యాయం పోరాటం చేస్తామని, కోర్టులో తేల్చుకుంటామన్నారు. అనం తరం బీఆర్‌ఎస్‌ రాష్ట్ర నాయకుడు విజిత్‌రావు మాట్లాడుతూ నామినే షన్‌ జాబితాలో వైష్ణవి పేరు లేకున్నా ఆమెను సర్పంచుగా ప్రకటించ డం ఏమిటని, ప్రజాస్వామ్యాన్ని కాంగ్రెస్‌ ప్రభుత్వం కూనీ చేస్తుందని ఆరోపించారు. ఈ సమావేశంలో బీఆర్‌ఎస్‌ పట్టణాధ్యక్షుడు సత్యం, న స్పూర్‌ పట్టణాధ్యక్షుడు అటుకూరి సుబ్బన్న, నాయకులు రవీందర్‌రెడ్డి, తిరుపతి, అత్తి సరోజ, నరేష్‌, పవన్‌, కుమార్‌, కార్యకర్తలు పాల్గొన్నారు.

Updated Date - Dec 05 , 2025 | 12:07 AM