భక్తి శ్రద్ధలతో వినాయక చవితి ఉత్సవాలు జరుపుకోవాలి
ABN , Publish Date - Aug 20 , 2025 | 11:38 PM
విఘ్నాలు తొలగడానికి ఆటంకాలు జరగకుండా పనులు జరగాలన్న ఉద్దేశం తో నిర్వహించే వినాయక చవితి ఉత్సవా లను భక్తిశ్రద్ధలతో జరుపుకోవాలని నాగర్ కర్నూల్ డీఎస్పీ బుర్ర శ్రీనివాస్‌యాదవ్ పిలుపునిచ్చారు.
- డీఎస్పీ బుర్ర శ్రీనివాస్ యాదవ్
తిమ్మాజిపేట, ఆగస్టు 20 (ఆంధ్రజ్యో తి) : విఘ్నాలు తొలగడానికి ఆటంకాలు జరగకుండా పనులు జరగాలన్న ఉద్దేశం తో నిర్వహించే వినాయక చవితి ఉత్సవా లను భక్తిశ్రద్ధలతో జరుపుకోవాలని నాగర్ కర్నూల్ డీఎస్పీ బుర్ర శ్రీనివాస్‌యాదవ్ పిలుపునిచ్చారు. వినాయక చవితి ఉత్సవా ల సందర్భంగా తిమ్మాజిపేట రైతు వేదికలో బుధవారం ఆయా గ్రామాలకు చెందిన యువ కులు, రాజకీయ పార్టీ నాయకులతో సమావేశం నిర్వహించిన డీఎస్పీ మాట్లాడారు. గ్రామాల్లో ఉత్సవ కమిటీలు ఏర్పాటు చేసుకోవాలని బా ధ్యతగా వ్యవహరించాలన్నారు. ప్రతీ ఒక్కరు ఉత్సవాలకు ముందుగా పోలీసుశాఖ నుంచి అనుమతులు తీసుకోవాలని అన్నారు. కార్యక్ర మంలో సీఐ అశోక్‌రెడ్డి, ఎస్‌ఐ హరిప్రసాద్‌రెడ్డి, ఏఎస్‌ఐ శ్రీనివాసులు, రాష్ట్ర టెలికాం శాఖ డైరెక్టర్ శ్రీనివాస్‌బహుదూర్, పాల్గొన్నారు.
ఫ కల్వకుర్తి : వినాయక చవితి వేడుకల నిర్వహణపై కల్వకుర్తిలో డీఎస్పీ సైరెడ్డి వెంకట రెడ్డి, సీఐ బి.నాగార్జున, ఎస్‌ఐ జి.మాధవరెడ్డిలు శాంతి సమావేశం బుధవారం నిర్వహించారు. మునిసిపల్ కమిషనర్ మహమ్మద్‌షేక్, విద్యుత్ ఏఈ శ్రీనివాస్‌నాయక్, మునిసిపల్ ఏఈ షబ్బీర్, హిందూ, ముస్లిం సంఘాల పెద్దలు, మండపాల నిర్వాహకులు పాల్గొన్నారు.