kumaram bheem asifabad- కాంగ్రెస్‌తోనే గ్రామాల అభివృద్ధి
ABN , Publish Date - Dec 28 , 2025 | 10:14 PM
కాంగ్రెస్ పార్టీతోనే గ్రామాలు అభివృద్ధి చెందుతాయని ఆదిలాబాద్ ఎమ్మెల్సీ దండే విఠల్ తెలిపారు. ఆదివారం పెద్దసిద్దాపూర్ షెండె పద్మశంకర్ కాంగ్రెస్‌లో చేరగా పార్టీ కండువా వేసి ఆహ్వానించారు, ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్సీ మాట్లాడారు.
బెజ్జూరు, డిసెంబరు 28 (ఆంధ్రజ్యోతి): కాంగ్రెస్ పార్టీతోనే గ్రామాలు అభివృద్ధి చెందుతాయని ఆదిలాబాద్ ఎమ్మెల్సీ దండే విఠల్ తెలిపారు. ఆదివారం పెద్దసిద్దాపూర్ షెండె పద్మశంకర్ కాంగ్రెస్‌లో చేరగా పార్టీ కండువా వేసి ఆహ్వానించారు, ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్సీ మాట్లాడారు. ప్రజా ప్రభుత్వం ఏర్పాటై రెండేళ్లు పూర్తి అయిన సందర్భంగా రాష్ట్రంలో అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టినట్టు తెలిపారు. పెద్దసిద్దాపూర్ గ్రామ పంచాయతీ అభివృద్ధికి మార్చిలోగా రూ.50లక్షలతో నిధులు మంజూరు చేసి పలు అభివృద్ది కార్యక్రమాలను చేపట్టనున్నట్టు వివరించారు. అదే విధంగా ఈ ప్రాంత రైతులు పోడు భూముల సమస్యలను త్వరలోనే పరిష్కరిస్తామని చెప్పారు. గ్రామాల అభివృద్ధి కోసం కాంగ్రెస్ ప్రభుత్వం ఎళ్లప్పుడు ముందు ఉంటుందని అన్నారు. రాబోయే రోజుల్లో చిన్న పంచాయతీలకు రూ.5లక్షలు, పెద్ద పంచాయతీలకు రూ.10లక్షలు మంజూరు చేయనున్నట్లు తెలిపారు. అంతకుముందు మండల కేంద్రంలోని జ్యోతిబాఫూలే విగ్రహాలకు పూల మాల వేసి నివాళులు అర్పించారు. కార్యక్రమంలో బ్లాక్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు రాచకొండ శ్రీవర్ధన్, పార్టీ అధ్యక్షులు శంకర్, మాజీ జడ్పీటీసీ పుష్పలత, బెజ్జూరు ఉప సర్పంచి ఆదర్ష్, నాయకులు రామకృష్ణ, నాహిర్ అలీ, సురేష్ గౌడ్, జగ్గా గౌడ్ పాల్గొన్నారు.