కేంద్ర ప్రభుత్వ నిధులతోనే గ్రామాల అభివృద్ధి
ABN , Publish Date - Dec 23 , 2025 | 11:31 PM
కేంద్ర ప్రభుత్వ నిధులతోనే గ్రామాలు అభివృద్ధి చెందుతాయని బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు రఘునాధ్ వెరబెల్లి పేర్కొన్నారు. మంగళవారం జిల్లా కేంద్రంలోని బీజేపీ ప్రధాన కార్యాలయంలో నూతన గెలిచిన బీజేపీ సర్పంచులు, వార్డు సభ్యులను శాలువాలతో ఘనంగా సన్మానించారు.
-బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు వెరబెల్లి రఘునాధ్
మంచిర్యాల కలెక్టరేట్, డిసెంబరు 23 (ఆంధ్రజ్యోతి) : కేంద్ర ప్రభుత్వ నిధులతోనే గ్రామాలు అభివృద్ధి చెందుతాయని బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు రఘునాధ్ వెరబెల్లి పేర్కొన్నారు. మంగళవారం జిల్లా కేంద్రంలోని బీజేపీ ప్రధాన కార్యాలయంలో నూతన గెలిచిన బీజేపీ సర్పంచులు, వార్డు సభ్యులను శాలువాలతో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షుడు నగునూరి వెంకటేశ్వర్‌గౌడ్ అధ్యక్షతన నిర్వహించిన పార్టీ నాయకుల, కార్యకర్తల సమావేశంలో రఘునాధ్ మాట్లాడారు. వచ్చే ఎన్నికల్లో బీజేపీ ప్రభుత్వం రావడం ఖాయమని తెలిపారు. పంచాయతీ ఎన్నికల్లో విజయ దుందుభి మోగించామని, మున్సిపల్ ఎన్నికల్లో కూడా విజయం సాధిస్తామన్నారు. కేంద్ర ప్రభుత్వ నిధులతో గ్రామాలను మరింత అభివృద్ధి చేస్తామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు దుర్గం అశోక్, గాజుల ముకేష్‌గౌడ్, వెంకటేశ్వర్‌రావు, కృష్ణమూర్తి, రమేష్, సంతోష్, రమేష్, శ్రీదేవి, శ్రీధర్ పాల్గొన్నారు.