కేంద్రం నిధులతోనే గ్రామాల అభివృద్ధి
ABN , Publish Date - Nov 25 , 2025 | 11:33 PM
కేంద్రం ఇచ్చిన నిధులతోనే గ్రామాలు అభివృద్ధి పథంలో ఉన్నాయని బీజేపీ జిల్లా అధ్యక్షుడు నగునూ రి వెంకటేశ్వర్ గౌడ్ అన్నారు. వచ్చే సర్పంచ్ ఎన్నికల దృశ్ట్యా పట్టణంలోని ఎస్‌ఆర్‌ఆర్ గార్డెన్స్‌లో మంగళవారం దండేపల్లి, లక్షెట్టిపేట, హాజీపూర్ మం డలాల బీజేపీ నాయకులతో కలిసి సన్నాహక సమావేశం నిర్వహించారు.
బీజేపీ జిల్లా అధ్యక్షుడు వెంకటేశ్వర్‌గౌడ్
లక్షెట్టిపేట, నవంబరు 25 (ఆంధ్రజ్యోతి): కేంద్రం ఇచ్చిన నిధులతోనే గ్రామాలు అభివృద్ధి పథంలో ఉన్నాయని బీజేపీ జిల్లా అధ్యక్షుడు నగునూ రి వెంకటేశ్వర్ గౌడ్ అన్నారు. వచ్చే సర్పంచ్ ఎన్నికల దృశ్ట్యా పట్టణంలోని ఎస్‌ఆర్‌ఆర్ గార్డెన్స్‌లో మంగళవారం దండేపల్లి, లక్షెట్టిపేట, హాజీపూర్ మం డలాల బీజేపీ నాయకులతో కలిసి సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ స్థానిక సంస్థల ఎన్నికలకు బీజేపీ సి ద్ధంగా ఉందన్నారు. సర్పంచ్ ఎన్నికల రిజర్వేషన్లలో బీసీలకు తీరని నష్టం జరిగిందని కాంగ్రెస్ పార్టీలో బీసీ మంత్రులు ఉండి రిజర్వేషన్లలో బీసీలను బిచ్చగాళ్లకంటే హీనంగా చూస్తూ రిజర్వేషన్లను కేటాయించారని మండి ప డ్డారు. సర్పంచ్ ఎన్నికల్లో బీసీలు కాంగ్రెస్ పార్టీకి బుద్ది చెప్పడం ఖాయం అన్నారు. అనంతరం బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు వెరబెల్లి రఘునాథ్ మా ట్లాడుతూ గ్రామాల్లో బీజేపీ అభ్యర్థులు గెలిస్తే కేంద్రం నుంచిఎక్కువ నిధు లు తీసుకువస్తూ గ్రామాలను అన్ని విధాలుగా అభివృద్ధి చెందే దిశగా ఉం టుందన్న విషయం ప్రజల్లోకి తీసుకుపోవాలన్నారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్ కల్పిస్తానన్న కాంగ్రెస్ పార్టీ జిల్లాలో బీసీలకు కనీసం 8శాతం కూడా కల్పించలేదన్నారు. ఈకార్యక్రమంలో మాజీ జడ్పీటీసీ ముత్తె సత్త య్య, నాయకులు కృష్ణమూర్తి, నరేష్‌చంద్, రమేష్ చంద్ పాల్గొన్నారు.51నస్పూర్25: సమావేశంలో మాట్లాడుతున్న డీఇఓ యాదయ్య
నేటి నుంచి నస్పూర్‌లో జిల్లా స్థాయి వైజ్ఞానిక ప్రదర్శన
నస్పూర్, నవంబరు 25 (ఆంధ్రజ్యోతి) : నస్పూర్ పట్టణం సీసీ సీలోని ఆక్స్‌ఫర్డ్ హైస్కూల్‌లో బుధవారం నుంచి జిల్లా స్థాయి బా ల వైజ్ఞానిక ప్రదర్శన-2025-26, ఇన్స్‌స్పైర్ అవార్డు ప్రదర్శన -2024 -25 సైన్స్ ఎగ్జిబిషన్ ప్రారంభం కానుంది. ఈ నెల 26 నుంచి 28 వరకు వివిధ రకాల ప్రదర్శనలు నిర్వహించనున్నారు. దీనికి సం బంధించిన అన్ని ఏర్పాట్లును జిల్లా విద్యా శాఖ అధికారులు పూర్తి చేశారు. సీసీసీలోని ప్రైవేట్ పాఠశాల వేధికగా నిర్వహించే బాల వైజ్ఞానిక ప్రదర్శనకు విద్యా శాఖ ఆధ్వర్యంలో 18 కమిటీలను ఏర్పా టు చేసి ఏర్పాట్లు చేపట్టింది. ప్రదర్శనలు, సెమినార్, అథితుల ఆ హ్వానం, రిజిస్ర్టేషన్, బాల బాలికల వసతి, క్రమ శిక్షణ, ఆహ్వాన వే దిక నిర్వహన, ఆరోగ్య, ప్రథమ చికిత్స బహుమతుల పంపిణీ, తది తర సౌకర్యాల నిర్వహణ బాద్యతల కమిటీలకు అప్పగించారు. బుధవారం సీసీసీలో ప్రారంభం కానున్న జిల్లా స్థాయి బాల వైజ్ఞా నిక ప్రదర్శనకు జిల్లా అధికారులు, ప్రజా ప్రతినిధులు విద్యార్థులు హాజరు కానున్నారు.
ఫ అన్ని ఏర్పాటు పూర్తి చేశాం : డీఈవో యాదయ్య
నస్పూర్‌లో బుధవారం నుంచి ప్రారంభమైయ్యే జిల్లా స్థాయి బాల వైజ్ఞానిక ప్రదర్శనకు సంబందించిన ఏర్పాట్లపై మంగళవారం సన్నాహాక సమావేశం డీఈవో యాదయ్య ఆధ్వర్యంలో జరిగింది. ప్రదర్శన నిర్వహణ సందర్భంగా చేపట్టాల్సిన ఏర్పాట్లపై సమావే శంలో చర్చించారు. ఉపాధ్యాయులు, ప్రదర్శనలు, సెమినర్ నిర్వ హించడం, ఫిజికల్ డైరెక్టర్ల ద్వారా క్రమ శిక్షణ, పర్యవేక్షణ, వి ద్యార్థుల భద్రత, తదితర అంశాలపై సూచనలు సలహాలను ఇ చ్చారు. ఈ సందర్భంగా డీఈవో మాట్లాడుతూ సైన్స్ మేళా కు అన్ని ఏర్పాట్లను చేవామన్నారు. ఈ ప్రదర్శనలకు మేధావులైనా బా ల శాస్త్త్రవేత్తలు సిద్ధం కావాలన్నారు. ఈ సన్నాహాక సమావేశంలో జిల్లా సైన్స్ అధికారి (డీఎస్‌ఓ) రాజ గోపాల్, మండల విద్యాధికారి పద్మజాలతో పాటు పాఠశాలల ఉపాధ్యాయులు పాల్గొన్నారు.