ఉపాధి హామీ పనులపై గ్రామ సభలు పూర్తి
ABN , Publish Date - Nov 09 , 2025 | 11:35 PM
మండలంలోని 38 గ్రామ పంచాయతీల్లో 2025-26 సంవత్సరానికి ఉపాధి హా మీ పనులకు సంబంధిం చిన గ్రామ సభలు పూర్తైన ట్లు అడిషనల్ ప్రోగ్రాం ఆఫీ సర్ బి.సుదర్శన్‌గౌడ్ తెలి పారు.
అచ్చంపేట రూరల్, న వంబరు 9 (ఆంధ్రజ్యోతి) : మండలంలోని 38 గ్రామ పంచాయతీల్లో 2025-26 సంవత్సరానికి ఉపాధి హా మీ పనులకు సంబంధిం చిన గ్రామ సభలు పూర్తైన ట్లు అడిషనల్ ప్రోగ్రాం ఆఫీ సర్ బి.సుదర్శన్‌గౌడ్ తెలి పారు. అచ్చంపేట అన్ని గ్రా మ పంచాయతీలకు ఉపాధి హామీ పథకంలో వివిధ పను ల క్రింద 2026-27 సంవత్సరా నికి రూ.84కోట్ల 77లక్షల 49వేలు లేబర్ బడ్జె ట్ ప్రతిపాదనల ఆమోదం కోసం పైఅధికారు లకు పంపినట్లు తెలిపారు. గ్రామసభ ద్వారా గుర్తించి బడ్జెట్ త యారు చేయడం జరుగుతుందని 40:60 శాతంతో మెటీరియిల్ కాంపొనెంట్ వెజ్ కాంపొ నెంట్ కింద కేటాయించి గ్రామసభ ఆమోదం పొందాలి. అచ్చంపేట మండలంలో ఉపాధిహా మీ జాబ్‌కార్డులు 11,912 మందికి ఉండగా 90 శాతం ఈకేవైసీ పూర్తి అయిందని, కొన్ని టెక్ని కల్ సమస్యల వల్ల పదిశాతం ఆలస్యం అయిం దన్నారు. గ్రామసభలు శనివా రంతో పూర్తయ్యా యని ఏపీవో సుదర్శన్‌గౌడ్ తెలిపారు.