Kurnool Bus Fire Tragedy: మాంసపు ముద్దలై!
ABN , Publish Date - Oct 25 , 2025 | 05:38 AM
కర్నూలు జిల్లా బస్సు ప్రమాద ఘటనలో మృతదేహాలు గుర్తుపట్టలేనంతగా కాలిపోయి మాంసపు ముద్దలుగా మారాయి. ఏ మృతదేహం ఎవరి దో...
కర్నూలు, అక్టోబరు 24(ఆంధ్రజ్యోతి): కర్నూలు జిల్లా బస్సు ప్రమాద ఘటనలో మృతదేహాలు గుర్తుపట్టలేనంతగా కాలిపోయి మాంసపు ముద్దలుగా మారాయి. ఏ మృతదేహం ఎవరి దో గుర్తించలేని విధంగా ఉన్నాయి. కొన్ని మృతదేహాల శరీర భాగాలు విడిపోయాయి. ప్రమా దం జరిగిన దాదాపు గంట తర్వాత పోలీసు వాహనాలు, అంబులెన్సులు వచ్చాయి. బస్సులో పడి ఉన్న మృతదేహాలను చూస్తే.. ప్రాణాలు కాపాడుకోడానికి తీవ్రంగా ప్రయత్నాలు చేసినట్లు తెలుస్తోంది. బస్సు మధ్యలో కాలిపోయిన శవాలు గుట్టలుగా కనిపించడంతో తొక్కిసలాట జరిగి ఉంటుందని పోలీసులు భావిస్తున్నారు. బస్సు మొదటి నుంచి చివరి వరకు కాలిపోయిన శవాలే కనిపిస్తున్నాయి. అమ్మ పక్కనే పడుకున్న ఇద్దరు పసిపల్లలు అమ్మతోపాటు మాంసపుముద్దలుగా మారిన తీరు కన్నీరు తెప్పిస్తోంది. మాంసపు ముద్దలుగా మారిన మృతదేహాలను తీసుకొస్తున్న సిబ్బంది చేతులు రక్తంతో తడిసిపోయాయి. ఓ మృతదేహాన్ని దించుతుండగా.. త లభాగం విడిపోవడంతో మరో వ్యక్తి ఆభాగాన్ని జాగ్రత్తగా తెచ్చి మృతదేహం పక్కనే పెట్టారు.