Share News

అమరవీరుల స్థూపం నిర్మాణ పనుల్లో వీహెచ

ABN , Publish Date - May 15 , 2025 | 12:22 AM

అమరవీరుల స్థూపం నిర్మాణానికి కంకర మోస్తూ.. కూలీలతో పనిచేస్తూ రాజ్యసభ మాజీ సభ్యుడు వి. హనుమంతరావు అందరినీ ఉత్సాహపరిచారు.

 అమరవీరుల స్థూపం నిర్మాణ పనుల్లో వీహెచ
స్థూపం నిర్మాణానికి కంకర మోస్తున్న మాజీ ఎంపీ వి.హనుమంతరావు

కంకర మోస్తూ.. కూలీలతో పనిచేస్తూ

అమరవీరుల స్థూపం నిర్మాణ పనుల్లో వీహెచ

శాలిగౌరారం, మే 14 (ఆంధ్రజ్యో తి): అమరవీరుల స్థూపం నిర్మాణానికి కంకర మోస్తూ.. కూలీలతో పనిచేస్తూ రాజ్యసభ మాజీ సభ్యుడు వి. హనుమంతరావు అందరినీ ఉత్సాహపరిచారు. మండలంలోని వల్లాల గ్రా మంలో జడ్పీ హైస్కూల్‌లో స్వాతం త్య్ర ఉద్యమకారుల జ్ఞాపకార్థం స్థూ ప నిర్మాణ పనులు చేపడుతుండగా ఈ సంఘటన జరిగింది. ఇందుకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. స్వాతంత్య్రం వచ్చిన అనంతరం వ ల్లాల గ్రామంలో 1948లో కొంతమం ది స్వాతంత్య్ర ఉద్యమకారులు జాతీ య జెండాను ఎగురవేశారు. అప్పటి నవాబ్‌ ప్రైవేట్‌ సైన్యమైన రజాకారులు జెండా ఎగురవేసిన 10మంది గ్రామస్థులను ప్రస్తుత జడ్పీ హైస్కూల్‌ ఉన్న ప్రదేశంలో కా ల్చి చంపారు. వారి చరిత్రను తెలుసుకున్న సీనియర్‌ నేత హనుమంతరావు మూడేళ్లుగా ఆగస్టు 15వ తేదీన వల్లాల జడ్పీ హైస్కూల్‌కు వచ్చి వారిని చంపిన ప్రదేశంలో మృతులకు నివాళులర్పిస్తున్నారు. ఆ ప్రదేశంలో స్మారక స్థూపాన్ని నిర్మించేందుకు గతేడాది శంకుస్థాపన చేశారు. బుధవారం నిర్మాణ పనులను పరిశీలించిన వీహెచ ఇసుక, కంకర, సిమెంట్‌ ఉన్న తట్ట మోసి అందరినీ ఉత్సాహపరిచారు. కూలీలు తక్కువ కంకర వేయడంతో ‘ఇంకా ముసలివాడిని కాలేదు. కంకర ఇంకా వేయండి రా బై’ అంటూ తట్ట నిండా కంకర నింపించి నెత్తిపై ఎత్తుకుని పిల్లర్ల గుంతలో వేశా రు. ఈ సందర్భంగా వీహెచ మాట్లాడుతూ వల్లాల అమరుల త్యాగాన్ని రాబోయే తరాలకు తెలియజేసేందుకే సొంత వ్యయంతో స్థూపం నిర్మిస్తున్నట్లు తెలిపారు. ఈ ఏడాది ఆగస్టు 15న స్థూపాన్ని సీఎం, మంత్రులతో కలిసి ప్రారంభిస్తామని తెలిపారు. కార్యక్రమంలో నాయకులు ఎంఏ బాసిత, ఇంతియాజ్‌ అహ్మద్‌, దండ అశోక్‌రెడ్డి, మాదగోని రామలింగయ్య, నర్సింహ, శ్రీకాంత గౌడ్‌, సురేందర్‌రెడ్డి పాల్గొన్నారు.

Updated Date - May 15 , 2025 | 12:22 AM