వెంకటస్వామి సేవలు చిరస్మరణీయం
ABN , Publish Date - Dec 22 , 2025 | 11:21 PM
పెద్దపల్లి పార్లమెంట్ స్థానం నుంచి లోక్ సభ సభ్యు నిగా గడ్డం వెంకటస్వామి అందించిన సేవలు చిరస్మ రణీయమని కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు.
మంచిర్యాల కలెక్టరేట్, డిసెంబరు 22 (ఆంధ్రజ్యోతి) : పెద్దపల్లి పార్లమెంట్ స్థానం నుంచి లోక్ సభ సభ్యు నిగా గడ్డం వెంకటస్వామి అందించిన సేవలు చిరస్మ రణీయమని కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. సోమ వారం కలెక్టర్ సమావేశ మందిరంలో గడ్డం వెంకట స్వామి వర్ధంతిని ఘనంగా నిర్వహించారు. వెంకట స్వామి చిత్రపటానికి కలెక్టర్ పూలమాలలు వేసి నివా ళులర్పించారు. కలెక్టరేట్ పరిపాలన అధికారి పిన్న రా జేశ్వర్, జిల్లా సంక్షేమాధికారి రౌఫ్ ఖాన్, అధికారులు దుర్గా ప్రసాద్, కిషన్, హనుమం తరెడ్డి పాల్గొన్నారు.
మంచిర్యాలక్రైం: కాకా వెంకటస్వామి వర్ధంతి వేడు కలను రామగుండం పోలీసుకమిషనరేట్‌లో ఘనంగా నిర్వహించారు. అదనపు డీసీపీ అడ్మిన్ కె. శ్రీనివాస్ ఆయన చిత్రపటానికి పూల మాలలు వేసి నివాలులు ఆర్పించారు. ఆయన మాట్లాడుతూ సేవా, క్రమ శిక్షణ, నై తికత, వెంకటస్వామి జీవితం నిదర్శనమన్నారు. సు దీర్ఘ కాలంపాటుకేంద్ర మంత్రిగా పార్లమెంటు సభ్యు డిగా ప్రాతినిధ్యం వహించారన్నారు. ఈ కార్యక్రమంలో ఎఆర్‌ఏసీపీ ప్ర తాప్, ఏవో శ్రీనివాస్, ఆర్‌ఐ దామోదర్ పాల్గొన్నారు.
ఫమంచిర్యాలపట్టణంలో కాకా వెంకటస్వామి వర్థం తి ఘనంగా నిర్వహించారు. మాజీ కౌన్సిలర్ హరిక్రిష్ణ ఆధ్వర్యంలో ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు పండ్ల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. వారి ఆశయా లను కొనసాగించాలని పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీక్రిష్ణ వారి అన్నారు. నాయకులు నల్ల రవి పాల్గొన్నారు.