kumaram bheem asifabad-వాహనాలను క్షుణ్ణంగా పరిశీలించాలి
ABN , Publish Date - Dec 02 , 2025 | 10:48 PM
సర్పంచ్ ఎన్నికల్లో భాగంగా రాష్ట్ర ఎన్నికల సంఘం ఏర్పాటు చేసిన చెక్ పోస్టులో అప్రమత్తంగా ఉండి ప్రతీ వాహనాన్ని క్షుణ్ణంగా పరిశీలించాలని జిల్లా ఎస్పీ నితికా పంత్ అన్నారు. సిర్పూర్(టి) మండలం సరిహద్దులోని వెంకట్రావుపేట- పోడ్సా వద్ద ఏర్పాటు చేసిన ఎన్నికల చెక్ పోస్టును మంగళవారం ఆమె తనిఖీ చేశారు. ఈ సందర్భంగా వాహనాల రాక పోకల రిజిస్టర్‌ను పరిశీలించారు.
సిర్పూర్(టి), డిసెంబరు 2 (ఆంధ్రజ్యోతి): సర్పంచ్ ఎన్నికల్లో భాగంగా రాష్ట్ర ఎన్నికల సంఘం ఏర్పాటు చేసిన చెక్ పోస్టులో అప్రమత్తంగా ఉండి ప్రతీ వాహనాన్ని క్షుణ్ణంగా పరిశీలించాలని జిల్లా ఎస్పీ నితికా పంత్ అన్నారు. సిర్పూర్(టి) మండలం సరిహద్దులోని వెంకట్రావుపేట- పోడ్సా వద్ద ఏర్పాటు చేసిన ఎన్నికల చెక్ పోస్టును మంగళవారం ఆమె తనిఖీ చేశారు. ఈ సందర్భంగా వాహనాల రాక పోకల రిజిస్టర్‌ను పరిశీలించారు. ఆమె మాట్లాడుతూ ఎన్నికల్లో భాగంగా మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్, గడ్చిరోలి నుంచి వచ్చే వాహనాలను క్షుణ్ణంగా పరిశీలించాలన్నారు. మద్యం, డబ్బులు, ఇతర ప్రలోబాలకు గురి చేసే వస్తువులు రవాణా చేస్తే ఎంతటి వారైనా వదిలి పెట్టేది లేదన్నారు. అట్టి వాహనాలను సీజ్ చేసి సమాచారం అందించాలని చెప్పారు. సిబ్బంది విధుల్లో నిర్లక్ష్యం చేయవద్దని ఎన్నికలు పూర్తయ్యే వరకు అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. ఆమె వెంట డీఎస్పీ వహీదుద్దీన్, సీఐ సురేష్, చెక్ పోస్టు సిబ్బంది ఇమ్రాన్‌ఖాన్ తదితరులు ఉన్నారు
సైబర్ మోసాలపై అప్రమత్తంగా ఉండాలి
ఆసిఫాబాద్, డిసెంబరు 2 (ఆంధ్రజ్యోతి): ఓటీపీ, యూపీఐ మోసాలపై అప్రమత్తంగా ఉండాలని ఎస్పీ నితికా పంత్ అన్నారు. జిల్లా పోలీసు శాఖ ఆధ్వర్యంలో మంగళవారం సైబర్ సారథి పేరుతో ప్రత్యేక అవగాహన డ్రైవ్ నిర్వహించారు. ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ సైబర్ నేరాల నివారణకు ‘ ప్రాడ్ కా ఫుల్ స్టాఫ్‘ ప్రచార కార్యక్రమం మంగళవారం డీజీపీ శివధర్‌రెడ్డి వర్చువల్‌గా ప్రారంభించారని చెప్పారు. ఈ అనంతరం కార్యక్రమ పోస్టర్లను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ఏఎస్పీ చిత్తరంజన్, సీఐలు రవీందర్, బాలాజీ వరప్రసాద్, తేజస్విని, మెడికల్ కళాశాల ప్రిన్సిపాల్ రాజేంద్రప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.