Share News

కొండెక్కిన కూరగాయలు...

ABN , Publish Date - Nov 19 , 2025 | 11:22 PM

మార్కె ట్లో కూరగాయల ధరలు మండిపోతున్నాయి. కొద్ది రో జులుగా కూరగాయల రేట్లు ఆకాశాన్నంటుతుండటం తో పేద, మధ్య తరగతి ప్రజలపై ఆర్థిక భారం పడు తోంది. పైగా కార్తీక మాసం కావడంతో మాంసాహార ప్రియులు కూడా దానికి దూరంగా ఉంటూ, కూరగా యలతో వండిన ఆహారంపైనే ఆధారపడుతారు.

కొండెక్కిన కూరగాయలు...

-ఆకాశాన్నంటుతున్న ధరలు

-ఏది కొనాలన్నా కిలో రూ. 100

-పేద, మధ్య తరగతి ప్రజలపై ఆర్థిక భారం

మంచిర్యాల, నవంబరు 19 (ఆంధ్రజ్యోతి): మార్కె ట్లో కూరగాయల ధరలు మండిపోతున్నాయి. కొద్ది రో జులుగా కూరగాయల రేట్లు ఆకాశాన్నంటుతుండటం తో పేద, మధ్య తరగతి ప్రజలపై ఆర్థిక భారం పడు తోంది. పైగా కార్తీక మాసం కావడంతో మాంసాహార ప్రియులు కూడా దానికి దూరంగా ఉంటూ, కూరగా యలతో వండిన ఆహారంపైనే ఆధారపడుతారు. దీంతో సాధారణ రోజుల కంటే ఈ మాసంలో కూరగాయల ధరలు సహజంగానే పెరిగిపోతుంటాయని వ్యాపారు లు సైతం చెబుతున్నారు. రూ. 200తో మార్కెట్‌కు వె ళితే మూడు రోజులకు సరిపడా కూరగాయలు రావడం లేదంటూ సామాన్య జనం వా పోతున్నారు. వారానికి సరిపడా కూరగాయలు కొనుగోలు చేయా లంటే కనీసం రూ. 400 వెచ్చించాల్సి వస్తోందంటున్నారు.

శ్రావణ మాసం నుంచి...

మూడు నాలుగు నెలలుగా కూరగాయల ధరలు కొండెక్కి కూ ర్చున్నాయి. ముఖ్యంగా శ్రావణ మాసం ప్రారంభమైన నాటి నుంచి మొదలుకొని ధరలు విపరీతంగా పెరిగాయి. శ్రావణ మాసం పవి త్రమైనది కావడంతో హిందువుల్లో అధిక భాగం ప్రజలు మాంసా హారానికి దూరంగా ఉంటారు. ఆ మాసంలో పూజలకు అధిక ప్రా ధాన్యం ఇవ్వడంతోపాటు వర్షాకాలంలో మాం సాహారం భుజిస్తే రో గాల భారిన పడతారనే సైంటిఫిక్‌ రీజన్‌ కూడా ఉండటంతో కూ రగాయలపైనే ప్రజలు అధికంగా ఆధారపడతారు. దీనికి తోడు మొంథా తుఫాన్‌ ప్రభావంతో భారీ వర్షాల కారణంగా కూరగాయ లు, ఆకు కూరల దిగుబడి గణనీయంగా తగ్గింది. ఈ కారణం గా నూ గతంలో ఎన్నడూ లేని విధంగా కూరగాయలు అధిక ధరలు పలుకుతున్నాయి. శ్రావణం తరువాత కార్తీక మాసం రావడం, అ నంతరం అయ్యప్ప మాలధారణ సమయం కావడంతో ధరలు ఆకా శాన్నంటుతున్నాయి. మరోవైపు జిల్లాలో కూరగాయల సాగు అం తంత మాత్రంగానే ఉంది. దీంతో దూరప్రాంతాల హోల్‌సేల్‌ వ్యా పారులు కూరగాయలు తెప్పిస్తున్నారు. వారి దగ్గరి నుంచి రిటైల్‌ విక్రేతలు కొనుగోలు చేసి, ప్రజలకు విక్రయించాలి. అలా వినియోగ దారుల చేతికి అందేసరికి నాలుగైదు చేతులు మారాల్సి రావడం కూడా ధరలు పెరుగదలకు కారణంగా తెలుస్తోంది.

జిల్లా కూరగాయల ధరలు (కిలోకు రూపాయల్లో)....

టమాట 100

పచ్చిమిర్చి 100

చిక్కుడు 100

అనుపకాయ 100

బీరకాయ 80

బెండకాయ 80

కొత్తిమీర 160

పాలకూర 120

తోటకూర 100

సోరకాయ 100

కాలీ ఫ్లవర్‌ 80

క్యాబేజీ 50

దొండ 80

అలచంద 80

క్యారెట్‌ 70

క్యాప్సికం 80

ఏం కొనేటట్లు లేదు...

నరెడ్ల రజిత, కాలేజ్‌ రోడ్డు మంచిర్యాల

మార్కెట్లో కూరగాయల ధరలు మండిపోతున్నాయి. ఏం కొనాలన్నా కిలో రూ. 100కు తక్కువ లేదు. వారానికి సరిపడా కొనాలంటే రూ. 400 వరకు వెచ్చిం చాల్సి వస్తోంది. కార్తీక మాసంతోపాటు అయ్యప్ప దీక్షా సమయం కావడంతో కూరగాయల ధరలు ఆకాశా న్నంటుతున్నాయి.

నాలుగు నెలలుగా ఇదే పరిస్థితి ...భాను చందర్‌, కూరగాయల విక్రేత, మంచిర్యాల

కూరగాయల ధరలు విపరీతంగా ఉన్నాయి. నాలు గు నెలలుగా కొంచం అటూ ఇటుగా ఇవే ధరలు కొన సాగుతున్నాయి. దీంతో కిలోల చొప్పున కొనుగోలు చేసే వాళ్లు కూడా అరకిలోతో సరిపెడుతున్నారు. నిత్యం ఇంట్లో ఉండాల్సిన టమాట, పచ్చిమిర్చి ధరలు కూడా కిలో రూ. 100 కంటే తక్కువ ఉండటం లేదు. పేద, మధ్యతరగతి ప్రజలకు పెరిగిన ధరలు భారంగా మారాయి.

Updated Date - Nov 19 , 2025 | 11:22 PM