kumaram bheem asifabad- కూరగాయల ధరలు పైపైకి
ABN , Publish Date - Nov 02 , 2025 | 10:17 PM
కూరగాయల ధరలు పెరుగుతుండడంతో సామాన్యుల పై భారం పడుతోంది. పదిహేను రోజుల్లో ధరలు బాగా పెరిగాయని ఇలా అయితే ఏం తినాలని సామాన్య, మధ్య తరగతి ప్రజలు ఆవేదన చెందుతున్నారు. ప్రతి ఆదివారం జరిగే వార సంతలో ఏ ఒక్కటి కొన్న కిలో రూ.100 పైనే పలుకుతోంది.
కెరమెరి, నవంబరు 2 (ఆంధ్రజ్యోతి): కూరగాయల ధరలు పెరుగుతుండడంతో సామాన్యుల పై భారం పడుతోంది. పదిహేను రోజుల్లో ధరలు బాగా పెరిగాయని ఇలా అయితే ఏం తినాలని సామాన్య, మధ్య తరగతి ప్రజలు ఆవేదన చెందుతున్నారు. ప్రతి ఆదివారం జరిగే వార సంతలో ఏ ఒక్కటి కొన్న కిలో రూ.100 పైనే పలుకుతోంది. ఇటీవల కురుస్తున్న వర్షాలకు కూరగాయలు పంటలు కుల్లిపోయి దిగుబడి గణనీయంగా తగ్గడంతో ఈ పరిస్థితి నెలకొందని వినియోగదారులు వాపోతున్నారు. కిలో బెండకాయ రూ.80, చిక్కుడు కాయలు రూ.100, అలుసంద రూ.80, పచ్చి మిర్చి రూ.120, క్యాబేజీ రూ.100, బీర కాయలు రూ.90, బీట్ రూట్ రూ.100, క్యారెట్ రూ.120, పాలకూర కట్ట రూ.25, మెంతికూర రూ.50 ఉన్నాయి. దీంతో కొనుగోలుదారులు ఇబ్బందులు పడుతున్నారు. జిల్లాలో ఓ వైపు వర్షాలు కురుస్తుండ డంతో దిగుబడులు తగ్గి కూర గాయల ధరలు అమాంతంగా పెరిగి పోయాయి. రోజురోజుకు ధరలు పెరిగిపోవడంతో సామాన్యడిపై ఆర్థిక భారం పడుతోంది. జిల్లాలో కూరగాయాల సాగు అంతంత మా త్రంగానే ఉంది. వరుస నష్టాలతో ఏటేటా కూరగాయల సాగుకు రైతులు దూరమవుతున్నారు. పెట్టుబడులు పెరగడంతో కూరగాయల సాగుకు రైతులు అంతగా ఆసక్తి చూపడం లేదు. జిల్లాలో రైతులు కూరగాయల పంటలు సాగు చేసిన పంట నిల్వలకు ఇబ్బందులు తప్పడం లేదు. దీంతో మార్కెట్ లో పంటను తక్కువ ధరలకే విక్రయించాల్సిన పరి స్థితులు నెలకొన్నాయి. రైతుల వద్ద తక్కువ ధరలకు కొనుగొలు చేసి హోల్‌సెల్ వ్యాపారులు ధరలు పెంచి చిరు వ్యాపారులకు విక్రయిస్తున్నారు. దీంతో ధరలు అమాంతంగా పెరుగుతున్నట్లు వినియోగదారులు చెబుతున్నారు. దీనికి తోడు జిల్లాలో పంటల సాగు తగ్గడంతో పొరుగు రాష్ర్టాల నుంచి కొన్ని రకాల కూరగాయలను దిగుమతి చేసుకొని వ్యాపారులు చిరు వ్యాపారులకు విక్రయిస్తుండడంతో కూడా ధరలు పెరిగిపోతున్నాయి.