kumaram bheem asifabad- కూరగాయల ధరలు పైపైకి
ABN , Publish Date - Jul 11 , 2025 | 10:22 PM
కూరగాయల ధరలు పెరుగుతుండడంతో సామాన్యుల పై భారం పడుతోంది. పదిహేను రోజుల్లో ధరలు బాగా పెరిగా యని ఇలా అయితే ఏం తినాలని సామాన్య, మధ్య తరగతి ప్రజలు ఆవేదన చెందుతున్నారు. జిల్లాలో ఓ వైపు వర్షాలు కురుస్తుండడంతో దిగుబడులు తగ్గి కూర గాయల ధరలు అమాంతంగా పెరిగిపోయాయి. రోజు రోజుకు ధరలు పెరిగిపోవడంతో సామాన్యడిపై ఆర్థిక భారం పడుతోంది
- సామాన్యులపై భారం
ఆసిఫాబాద్, జూలై 11 (ఆంధ్రజ్యోతి): కూరగాయల ధరలు పెరుగుతుండడంతో సామాన్యుల పై భారం పడుతోంది. పదిహేను రోజుల్లో ధరలు బాగా పెరిగా యని ఇలా అయితే ఏం తినాలని సామాన్య, మధ్య తరగతి ప్రజలు ఆవేదన చెందుతున్నారు. జిల్లాలో ఓ వైపు వర్షాలు కురుస్తుండడంతో దిగుబడులు తగ్గి కూర గాయల ధరలు అమాంతంగా పెరిగిపోయాయి. రోజు రోజుకు ధరలు పెరిగిపోవడంతో సామాన్యడిపై ఆర్థిక భారం పడుతోంది. ఏటా ఆషాఢం, శ్రావణమాసాల్లో ఇదే పరిస్థితి నెలకొంటుంది. వర్షాభావ పరిస్థితుల కారణంగా ప్రస్తుత సీజన్‌లో స్థానికంగా దిగుబడి తగ్టింది. ఇతర ప్రాంతాల నుంచి దిగుమతి చేసుకోవాల్సి రావడంతో ధరలపై తీవ్ర ప్రభావం చూపుతోంది.
- సాగు అంతంతే..
జిల్లాలో కూరగాయాల సాగు అంతంత మాత్రంగానే ఉంది. వరుస నష్టాలతో ఏటేటా కూరగాయాల సాగుకు రైతులు దూరమవుతున్నారు. పెట్టుబడులు పెరగడంతో కూరగా యాల సాగుకు రైతులు అంతగా ఆసక్తి చూపడం లేదు. దీనికి తోడు విత్తనాలు, ఎరువులు, పురుగుల మందుల ధరలు పెరిగిపోయాయి. జిల్లాలో రైతులు కూరగాయల పంటలు సాగు చేసిన పంట నిల్వలకు ఇబ్బందులు తప్పడంలేదు. దీంతో మార్కెట్ లో పంటను తక్కువ ధరలకే విక్రయించాల్సిన పరి స్థితులు నెలకొన్నాయి. రైతుల వద్ద తక్కువ ధరలకు కొనుగొలు చేసి హోల్‌సెల్ వ్యాపారులు ధరలు పెంచి చిరు వ్యాపారులకు విక్రయి స్తున్నారు. దీంతో ధరలు అమాంతంగా పెరుగుతున్నట్లు వినియోగదారులు చెబుతున్నారు. దీనికి తోడు జిల్లాలో పంటల సాగు తగ్గడంతో పొరుగు రాష్ర్టాల నుంచి కొన్ని రకాల కూరగాయలను దిగుమతి చేసుకొని వ్యాపారులు చిరు వ్యాపారులకు విక్రయిస్తుండడంతో కూడా ధరలు పెరిగిపోతున్నాయి.
- సామాన్యులకు భారం..
వర్షకాలం ప్రారంభమై నెలరోజులు గడిచినా కూరగా యల ధరలు తగ్గక పోవడంతో పేదలు ఇబ్బందులు పడుతున్నారు. క్రమంగా ధరలు పెరుగుతుండడంతో సామాన్య, మధ్యతరగతి ప్రజలకు ఆర్థికంగా బారం పడుతోంది. నెల క్రితం కిలో టమాటా రూ. 20 ఉండగా ప్రస్తుతం రూ. 40కు చేరుకుంది. పచ్చిమిర్చి కిలోకు రూ. 60 ఉండగా ప్రస్తుతం రూ. 100కు చేరుకుంది. అలాగే చిక్కుడు, కాకరకాయ, కాప్సికం, బెండకాయ, క్యాబేజి, బీరకాయ, అలుసంద తదితర కూరగాయల ధరలు మండిపోతు న్నాయి. జిల్లాలో జూన్‌లో సాధారణ వర్షాలు కురిశాయి. అక్కడక్కడ టమాటా ఇతర కూరగాయల సాగు కోసం రైతులు నారు పోశారు. జూలైలో సమృద్ధిగా వర్షాలు కురిస్తే ఆ పంటలు ఆగస్టు చివరి వారం వరకు చేతికి వచ్చే అవకాశాలు ఉన్నాయి. అప్పటి వరకు కూరగాయల ధరల పరిస్థితి ఇదే విధంగా ఉండే అవకాశం ఉందని చెబుతున్నారు.
ప్రస్తుతం కూరగాయల ధరలు(రూ. కిలోకు)
పచ్చిమిర్చి 100
టమాటా 40
బీరకాయ 80
చిక్కుడు 80
కాలిఫ్లవర్ 100
కాప్సికం 80
క్యారేట్ 80
కాకరకాయ 60
క్యాబేజీ 40
వంకాయ 40
బెండకాయ 60
అలుసంద 40
ధరలు రోజురోజుకు పెరుగుతున్నాయి..
- పావని, గృహిణి, ఆసిఫాబాద్
కూరగాయల ధరలు రోజురోజుకు పెరుగుతున్నాయి. రానున్న రోజుల్లో ధరలు మరింత పెరిగే అవకాశం ఉంది. దీంతో సామాన్య మధ్యతరగతి ప్రజలకు ఆ ర్థికంగా భారంగా మారింది. ఓ వైపు పిల్లల చదువులు, మరో వైపు అనారోగ్య సమస్యలతో ప్రజలు సతమత మవుతున్నారు. ప్రస్తుతం కూరగాయాలు, నిత్యావసరా ల ధరలు పెరుగుతుండడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు.